ఆ హీరోకేమైనా కాళ్లు, చేతులు పోయాయా.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఈ నెల 4వ తేదీన సంధ్య థియేటర్ ( Sandhya theater )లో జరిగిన తొక్కిసలాట ఘటన ఎంతోమందిని తీవ్ర మనోవేదనకు గురి చేసిన సంగతి తెలిసిందే.ఈ ఘటన విషయంలో బన్నీని పోలీసులు అరెస్ట్ చేయగా ఒకపూట జైలు జీవితం గడిపిన బన్నీ బెయిల్ పై విడుదలయ్యారు.

 Cm Revanth Reddy Sensational Comments Goes Viral In Social Media Details Inside-TeluguStop.com

అయితే ఈ ఘటనను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.

బన్నీని( Bunny ) పరామర్శించిన సెలబ్రిటీలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

బాలుడు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతుంటే ఈ సెలబ్రిటీలు ఎవరైనా పరామర్శించారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.ఒక్కపూట జైలుకు వెళ్లిన హీరోను మాత్రం కాళ్లు చేతులు పోయిన మనిషిని చూడటానికి వెళ్లినట్టు వెళ్లారని రేవంత్ రెడ్డి అన్నారు.

అక్కడేమైనా కాలు పోయిందా? కన్ను పోయిందా? చేయి పోయిందా? అని ఆయన ప్రశ్నించారు.

Telugu Bunny, Cmrevanth, Sandhya Theater, Sensational-Movie

కానీ ఆస్పత్రిలో ఒక ప్రాణం మాత్రం పోయిందని తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.సంధ్య థియేటర్ కు హీరో, హీరోయిన్ రావద్దని చెప్పామని వారు అక్కడికి వచ్చి తొక్కిసలాటకు కారణమయ్యారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.తల్లి చనిపోయి కొడుకు చావు బ్రతుకుల్లో ఉంటే ఒక్క సినీ స్టార్ కూడా పరామర్శించలేదని తెలంగాణ సీఎం అన్నారు.

Telugu Bunny, Cmrevanth, Sandhya Theater, Sensational-Movie

నటుడిని అరెస్ట్ చేస్తే ఇంత రాద్ధాంతం ఎందుకు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.అనుమతి అడిగినా పోలీసులు ఇవ్వలేదని అయినా హీరో వచ్చారని నార్మల్ గా వచ్చి వెళ్తే ఇలా జరిగి ఉండేది కాకపోవచ్చని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.వేలాదిమంది ఉప్పెనలా రావడంతో తొక్కిసలాట జరిగిందని ఆయన వెల్లడించారు.సీఎం చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.ఈ కామెంట్ల గురించి బన్నీ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube