యాక్టర్ సూర్య చేస్తున్న గుప్తదానాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే

సూర్య.తమిళనాడులో పుట్టి పెరిగిన ఈ సినిమా నటుడు తెలుగులో కూడా పలు సినిమాలు చేశాడు.అద్భుతమైన యాక్షన్ సినిమాలతో .భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తిపు తెచ్చుకున్నాడు.ఆయన భార్య జ్యోతిక సైతం తెలుగు జనాలకు సుపరిచితం.ఆమె కూడా తెలుగులో పలు సినిమాల్లో నటించింది.సూర్యను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె పలు సినిమాలు చేసింది.

 Actor Surya List Of Charity And Donations, Surya, Kollywood, Tollywood, Ghajina,-TeluguStop.com

ఈ ఇద్దరు కలిసి ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.ఎందరో అనాథలకు బాసటగా నిలుస్తున్నారు.

ఇంతకీ వారు చేస్తున్న సేవ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

*చెన్నైలో ఎంతో ఇష్టంగా.

కోట్ల రూపాయలు వెచ్చించి కట్టుకున్న సొంత ఇల్లును అనాథ పిల్లలకు రాసి ఇచ్చాడు.
*మొత్తం 128 మంది అనాథ పిల్లలను సూర్య దంపతులు దత్తత తీసుకున్నారు.
*వేల మంది పేద విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తున్నాడు.
*చాలా దేవాలయాలకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు.

దూపదీప నైవేద్య కార్యక్రమాలు జరిపిస్తున్నాడు.

ఈ పనులన్నీ రహస్యంగానే చేస్తున్నాడు హీరో సూర్య.

ఇంత గొప్ప పనులు చేసి కూడా బయటకు ఎందుకు చెప్పరని అడిగితే.దేవుడు తనకు సమాజంలో గొప్పగా బతికే అవకాశం ఇచ్చాడని చెప్పాడు.

అంటే అందరికీ తన ద్వారా మంచి చేయమని చెప్పినట్లు అంటాడు సూర్య.అందుకే తాను చేసే పనుల గురించి.

ఖర్చు చేసే డబ్బుల గురించి పెద్దగా ప్రచారం చేసుకోవడం ఇష్టంలేదని చెప్తాడు ఈ సూపర్ స్టార్.

Telugu Brothers, Ghajina, Jyothika, Kollywood, Singam, Surya, Tollywood, Yamudu-

అటు సూర్య తెలుగులో పలు సినిమాలు చేశాడు.గజిన, బ్రదర్స్, యముడు, సింగం-2 సహా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

తన భార్య సూర్య కూడా ఠాగూర్, చంద్రముఖి లాంటి బంఫర్ హిట్ సినిమాలు చేసింది.ఎంతో మంది అభిమానుల ఆదరణ పొందింది.

వీరిద్దరి సేవా గుణాలతో మరింత మంది అభిమానులను పొందారు.ఎంతో మందికి అండగా నిలుస్తున్న ఈ జంట నిజంగా అందరికీ ఆదర్శం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube