చ‌ర్మంపై ప‌డిన హెయిర్ డై మ‌ర‌క‌ల‌ను ఈజీగా ఎలా పోగొట్టుకోవాలో తెలుసా?

నేటి ఆధునిక కాలంలో యువ‌త‌ ఫ్యాషన్‌ పేరుతో సెలూన్‌కి వెళ్లి జుట్టుకు రకరకాల రంగుల‌ను వేసుకుంటున్నారు.కొంద‌రు ఇంట్లో కూడా రంగులు వేసుకుంటారు.

 How To Remove Hair Dye Stains On Skin! Hair Dye Stains On Skin, Hair Dye, Hair D-TeluguStop.com

అయితే హెయిర్ డై చేసుకునే స‌మ‌యంలో.చ‌ర్మంపై మ‌ర‌క‌లు ప‌డుతుంటాయి.

ముఖ్యంగా ముఖం, చెవులు, మెడ భాగాల్లో రంగులు అంటుకుంటాయి.ఇవి ఒక్కోసారి వ‌ద‌ల‌నే వ‌ద‌లవు.

దాంతో ఆ మ‌ర‌క‌ల‌ను ఎలా పోగొట్టుకోవాలో తెలియ‌క తెగ స‌త‌మ‌తం అవుతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే చిట్కాల‌ను పాటిస్తే చాలా ఈజీగా చ‌ర్మంపై ప‌డిన హెయిర్ డై మ‌ర‌క‌ల‌ను వ‌దిలించు కోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసు కుందాం ప‌దండీ.

వాసెలిన్‌తో చ‌ర్మంపై ప‌డిన డై రంగుల‌ను వ‌దిలించు కోవ‌చ్చు.

ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ వాసెలిన్‌, హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మ ర‌సం వేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని మ‌ర‌క పడిన చోట రాసి రుద్దాలి.

ఐదు నుంచి ప‌ది నిమిషాల పాటు బాగా రుద్ది.అప్పుడు గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, వ‌న్ టేబుల్ స్పూన్ డిష్‌వాషింగ్ లిక్విడ్ వేసి బాగా క‌ల‌పాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మంపై పూసి స్మూత్‌గా స్క్ర‌బ్ చేసుకోవాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకున్నా హెయిర్ డై మ‌ర‌కలు తొల‌గి పోతాయి.

నెయిల్ పాలిష్ రిమూవర్‌తో కూడా ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చు.కాటన్ ప్యాడ్ మీద నెయిల్ పాలిష్ రిమూవ‌ర్ వేసి మ‌ర‌క‌ పడిన చోట కాస్త వత్తుతూ రుద్దాలి.

ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో క‌డిగేస్తే హెయిర్ డై మ‌ర‌క తొల‌గి పోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube