కండరాల బలహీనతకు కార‌ణాలేంటి.. ఈ స‌మ‌స్య‌ను ఎలా అధిగ‌మించాలి?

శరీర కండరాలు తగినంత శక్తి లేదా సామర్థ్యాన్ని చూపించ‌లేక‌పోవ‌డ‌మే కండరాల బలహీనత( Muscle weaknes ).తేలికపాటి పనులు చేయ‌డం కూడా క‌ష్టంగా అనిపించ‌డం, శ‌క్తి లేక‌పోవ‌డం, కండరాల్లో సుతిమెత్తన నొప్పి, అల‌స‌ట‌, ఎక్కువసేపు నిల‌బ‌డ‌లేక‌పోవ‌డం లేదా న‌డ‌వ‌లేక‌పోవ‌డం, వ‌ణుకు వంటివి కండ‌రాల బ‌ల‌హీన‌త యొక్క ల‌క్ష‌ణాలు.

 What Are The Causes Of Muscle Weakness And How To Overcome This Problem? Muscle-TeluguStop.com

ప్రోటీన్, విటమిన్ డి, కాల్షియం, మరియు ఐరన్ కొర‌త కండ‌రాల బ‌ల‌హీన‌త‌కు దారి తీస్తుంది.అలాగే వయస్సు పెరిగే కొద్దీ కండరాలు ప‌టుత్వాన్ని కోల్పోయి బ‌ల‌హీనంగా మార‌తాయి.

మితిమీరిన శ్రమ లేదా వ్యాయామం లేకపోవడం వల్ల కండరాల సామర్థ్యం తగ్గుతుంది.డయాబెటిస్, హైపోథైరాయిడిజం( Diabetes, hypothyroidism ), స‌రైన విశ్రాంతి లేక‌పోవ‌డం, ప‌లు రకాల మందుల వాడ‌కం, శ‌రీరానికి స‌రిప‌డా నీటిని అందించ‌క‌పోవ‌డం, ఆటోఇమ్యూన్ వ్యాధులు( Autoimmune diseases ) కూడా కండ‌రాల బ‌ల‌హీన‌త‌కు కార‌ణం అవుతుంటాయి.

ఇక ఈ స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించ‌డానికి క‌చ్చితంగా పౌష్టికాహారం తీసుకోవ‌డంతో పాటుగా జీవ‌న‌శైలిలో కొన్ని మార్పులు కూడా చేసుకోవాలి.

Telugu Tips, Latest, Muscle Foods, Muscle Weakness, Muscleweakness, Muscles-Telu

డైట్ విష‌యానికి వస్తే.కండ‌రాల బ‌ల‌హీన‌త‌ను పోగొట్ట‌డానికి పాలు, గుడ్లు, చికెన్, పప్పుదినుసులు, సోయా, పన్నీర్ ( Milk, Eggs, Chicken, Legumes, Soya, Paneer )వంటి ఆహారాలు తీసుకోవాలి.వీటిలో ఉండే ప్రోటీన్ పుష్క‌లంగా ఉంటుంది.

కండరాల నిర్మాణానికి ప్రోటీన్ ప్రధానమైన ఆహారం.అలాగే కండ‌రాల శక్తి కోసం కార్బొహైడ్రేట్లు కూడా చాలా అవసరం.

అందుకోసం బ్రౌన్ రైస్, గోధుమ రొట్టె, ఓట్స్, స్వీట్ పొటాటో తీసుకోండి బ‌ల‌హీనంగా మారిన కండ‌రాలు రిక‌వ‌రీ అవ్వాలంటే.విటమిన్ డి, కాల్షియం, ఐరన్, పొటాషియం ఎంతో అవ‌స‌రం.

కాబ‌ట్టి, పాలు, ఆకుకూరలు, అరటిపండు, ఆరెంజ్, యాపిల్, దానిమ్మ‌ వంటి పండ్లు, న‌ట్స్‌, చేప‌లు, ఖ‌ర్జూరాలు త‌దిత‌ర ఆహారాలను డైట్ లో చేర్చుకోండి.విట‌మిన్ డి కోసం సప్లిమెంట్లు తీసుకోవ‌డం లేదా సూర్యకాంతికి బ‌హిర్గ‌తం కావ‌డం లాంటివి చేయండి.

Telugu Tips, Latest, Muscle Foods, Muscle Weakness, Muscleweakness, Muscles-Telu

రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి.మూడు లీట‌ర్ల వ‌ర‌కు నీటిని తీసుకోండి.వాకింగ్, జాగింగ్, యోగా వంటి వ్యాయామాల‌ను డైలీ రొటీన్ లో భాగం చేసుకోండి.మితిమీరిన శ్ర‌మ‌కు దూరంగా ఉండండి.కండరాలను తిరిగి శక్తివంతం చేయడానికి డాక్టర్ సలహాతో పోషకాల మాత్రలు లేదా టానిక్‌లను తీసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube