స్టార్ హీరో అల్లు అర్జున్ ( Allu Arjun )కు 2024 సంవత్సరం కలిసిరాలేదని చాలామంది ఫ్యాన్స్ ఫీలవుతారు.పుష్ప ది రూల్ ( Pushpa The Rule )సినిమాతో బన్నీ కమర్షియల్ హిట్ సాధించినా ఊహించని వివాదాలు బన్నీకి ప్రశాంతత లేకుండా చేశాయి.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి.బీసీ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ బన్నీ, ప్రొడక్షన్ టీం, సంధ్య థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
బన్నీ నిర్లక్ష్యం కారణంగా మానవ హక్కులకు తీవ్ర భంగం వాటిల్లిదందని ఫిర్యాదులో పేర్కొన్నారు.బన్నీ ప్రచార యావే ప్రాణం తీసిందని పరోక్షంగా ఫిర్యాదులో చెప్పుకొచ్చారు.ప్రేక్షకులను నియంత్రించలేమని పోలీసులు హెచ్చరించినా లెక్కలేనితనంతో బన్నీ వచ్చారని ఆయన పేర్కొన్నారు.బన్నీ వల్ల ఒక నిండు ప్రాణం బలైందని ఆమె కుమారుడు శ్రీతేజ( Sriteja ) చావుబ్రతుకుల మధ్య ఉన్నాడని చెప్పుకొచ్చారు.
పరిస్థితులు అన్నీ బన్నీకి వ్యతిరేకంగా మారుతున్నాయి.బన్నీ సినీ కెరీర్ కూడా ప్రమాదంలో పడ్డట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.బన్నీ ఈ కేసు నుంచి పూర్తిస్థాయిలో బయటపడటం మాత్రం జరిగే పని కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బన్నీకి వ్యతిరేకంగా పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ఈ హీరో ఏం చేస్తారో చూడాల్సి ఉంది.
బన్నీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
అల్లు అర్జున్ తర్వాత సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కాల్సి ఉండగా ఈ సినిమా షూట్ సమయానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయో లేదో చూడాల్సి ఉంది.బన్నీ ఈ కేసు నుంచి బయటపడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.అల్లు అర్జున్ క్రేజ్ మాత్రం మమూలుగా లేదని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బన్నీ రెమ్యునరేషన్ ఊహించని స్థాయిలో పెరిగిందనే సంగతి తెలిసిందే.