కేవలం రెండు మందారం పువ్వులతో హెయిర్ ఫాల్ కు ఈజీగా చెక్ పెట్టండి!

హెయిర్ ఫాల్( Hair fall ) అనేది చాలా కామన్ గా వేధించే సమస్యల్లో ఒకటి.అయితే కొందరిలో జుట్టు అధికంగా ఊడిపోతుంటుంది.

 How To Stop Hair Fall With Hibiscus Flowers!, Hibiscus Flowers, Stop Hair Fall,-TeluguStop.com

ఇందుకు కారణాలు ఎన్నో ఉన్నాయి.సరైన పోషకాలు అందకపోవడం, ఆహారపు అలవాట్లు, జుట్టు సంరక్షణ లేకపోవడం, రెగ్యులర్ గా షాంపూ చేసుకోవడం, ఒత్తిడి, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల హెయిర్ ఫాల్ అనేది అధికంగా ఉంటుంది.

అయితే ఈ సమస్యను పరిష్కరించుకోవడం ఎలాగో తెలియక మరింత ఒత్తిడికి గురవుతుంటారు.

Telugu Care, Care Tips, Fall, Pack, Long, Thick, Thin-Telugu Health

కానీ వర్రీ వద్దు.మన అందరి ఇళ్లలో ఉండే మందారం పువ్వులతో( Hibiscus ) సులభంగా హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం మందార పువ్వులతో జుట్టు రాలడాన్ని ఎలా అడ్డుకోవచ్చో తెలుసుకుందాం పదండి.

ముందుగా రెండు మందారం పువ్వులను తీసుకుని కాడలు తీసి పెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక అలోవెరా ఆకును తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండర్ లో మందారం పువ్వులు మరియు ఫ్రెష్ అలోవెరా జెల్( Aloevera Gel ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.40 నిమిషాలు లేదా గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

Telugu Care, Care Tips, Fall, Pack, Long, Thick, Thin-Telugu Health

వారానికి రెండు సార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే హెయిర్ ఫాల్ ఎంత తీవ్రంగా ఉన్నా క్రమంగా కంట్రోల్ అయిపోతుంది.జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పొడుగ్గా పెరగడం ప్రారంభమవుతుంది.చాలా మంది జుట్టును సిల్కీగా( Silky Hair ) మార్చుకునేందుకు తెగ ప్రయత్నిస్తుంటారు.అయితే అందుకు కూడా ఈ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.కాబట్టి హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టాలని భావించే వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube