వ్యవసాయ రంగంలో సాగు చేసే పంటలపై పూర్తి అవగాహన ఉంటేనే అధిక దిగుబడి సాధించడానికి అవకాశాలు ఉంటాయి.తీగ జాతి పంటలు సాగు చేయాలి అనుకునేవారు పొట్లకాయ సాగు( Snake gourd ) చేసి అధిక లాభాలు పొందవచ్చు.
పొట్లకాయను సాగు చేసేందుకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో చూద్దాం పొట్లకాయలలో లేత ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ( Light green, dark green ) అనే రెండు రకాలు ఉంటాయి.నేల యొక్క స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి ఏ రకం పొట్లకాయలను సాగు చేయాలో నిర్ధారించుకోవాలి.
పొట్లకాయ సాగు చేయాలంటే ముఖ్యంగా నేలలో అధిక తేమ ఉండడం అవసరం.ఇక సేంద్రియ ఎరువులకు అధిక ప్రాధాన్యత ఇస్తే నాణ్యమైన అధిక దిగుబడి పొందవచ్చు.
ఏడాది ప్రారంభం జనవరి రెండో వారం వరకు విత్తుకోవచ్చు.సూర్యరశ్మి, గాలి( Sunlight, wind ) మొక్కలకు తగిలే విధంగా మొక్కల మధ్య 60 సెంటీమీటర్ల దూరం, వరుసల మధ్య రెండు మీటర్ల దూరం ఉండేటట్లు పందిరి విధానంలో సాగు చేయాలి.ఈ పంట సాగుకు నీటి అవసరం కాస్త ఎక్కువగానే ఉంటుంది.కాబట్టి విత్తిన నాలుగు రోజులకు తేలికపాటి నీటి తడులు అందించాలి.పంట పూత, పిందె దశలో ఉన్నప్పుడు నీటి కొరత లేకుండా సమృద్ధిగా నీటిని పారించాలి.
విత్తనాలను విత్తన శుద్ధి చేసుకుని నాటుకుంటే వివిధ రకాల చీడపీడల బెడద, తెగుళ్ల బెడద( Pests ) ఉండదు.విత్తనాలు విత్తిన పది రోజులలోపు మొలకెత్తుతాయి.నెలరోజుల తర్వాత గొర్రుతో అంతర కృషి చేయాలి.
ఆ తరువాత కలుపును నివారించాలి.ఆ తర్వాత బలంగా ఉండే మొక్కలు కాకుండా బలహీనంగా ఉండే మొక్కలను తొలగించాలి.
తొలి దశ నుండే మొక్క తీగలు పందిరి పైకి పాకే విధంగా చర్యలు తీసుకోవాలి.ఇక ఐదు మిల్లీలీటర్ల వేప నూనెను ఒక లీటరు నీటిలో కలిపి పంటకు పిచికారి చేస్తే దాదాపుగా చీడపీడల, తెగుళ్ల బెడద ఉండదు.