Sania Mirza Shoaib Malik : ఔను సానియా, షోయబ్ మాలిక్ విడిపోయారు..?

టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ వైవాహిక బంధంపై ఇటీవలి కాలంలో చాలా వదంతులు, ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి.షోయబ్ కు సానియా దూరంగా ఉంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

 Shoaib Malik Affair With Pakistan Model Rumors Viral,sania Mirza,shoaib Malik,s-TeluguStop.com

వీరు విడాకులు తీసుకోనున్నారనే ప్రచారం కూడా నడుస్తోంది.మరి ఈ వార్తలు నిజమేనా.? అన్న సందేహం కలుగుతోంది.

ఒకవేళ తమ వైవాహిక బంధంపై జరిగే ప్రచారం అసత్యమే అయితే.

ఇందులో నిజం లేదంటూ అటు షోయబ్ కానీ, ఇటు సానియా కానీ ఖండించడం లేదు.అసలు వీరు ఇంత వరకు స్పందించలేదు.

తమ మధ్య ఏ పొరపొచ్ఛాలు లేకపోతే సెలబ్రిటీలుగా ఉన్న వీరు కచ్చితంగా వాటిని ఖండించాలి.కానీ, ఆ పని చేయడం లేదు.

ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం సానియా ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన పోస్ట్ అనుమానాలకు తావిస్తోంది.‘‘బద్దలైన హృదయాలు ఎక్కడికి వెళతాయి? అల్లాను వెతుక్కుంటూ’’ అంటూ సానియా పోస్ట్ పెట్టింది.దీన్ని బట్టి ఎవరి హృదయం బద్దలైందని సానియా చెబుతోంది? అలాగే.మరో పోస్ట్ లో, సానియా ఫ్లోర్ పై పడుకుని ఉంటే, ఆమె కుమారుడు ప్రేమగా ముఖంపై ముద్దు ఇస్తున్న ఫొటోను ఉంచి.

‘భారమైన రోజుల్లో నేను గడుపుతున్న క్షణాలు’ అంటూ కొటేషన్ పెట్టింది.తాజాగా తాను సింగిల్ గా ఉన్న ఫొటోను సానియా ఇన్ స్టా లో షేర్ చేసింది.

దీన్ని బట్టి సానియా, షోయబ్ బంధం సాఫీగా ఉందా? అన్న సందేహాలు మరింత బలపడుతున్నాయి.సానియా, షోయబ్ ప్రేమించి, 2010 ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్నారు.

వారికి 2018లో ఇజ్ హాన్ జన్మించాడు.

అయితే సోషల్ మీడియా వేదికగా సానియా మీర్జా చేసిన పోస్ట్‌లు, పరోక్ష వ్యాఖ్యలు విడాకులు తీసుకున్న ప్రచారానికి మరింత ఆజ్యాన్ని పోశాయి.అయితే, వాళ్లిద్దరూ విడిపోయారని.అందుకే సంబంధించిన పనులన్నీ పూర్తిపోయినట్టు తెలుస్తోంది.12 ఏళ్ల తమ వైవాహిక బంధాన్ని తెంచుకునేందుకు ఈ స్టార్ కపుల్ సిద్దమైందనే పుకార్లు షికారు చేస్తున్నాయి.గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేదని, సంసారం సాఫీగా సాగడం లేదని ప్రచారం జరుగుతోంది.

ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారని ప్రచారం జరిగింది.సానియా మీర్జా చేసిన పోస్ట్‌లు, పరోక్ష వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత ఆజ్యాన్ని పోశాయి.

అయితే, వాళ్లిద్దరూ విడిపోయారని.అందుకే సంబంధించిన పనులన్నీ పూర్తిపోయినట్టు తెలుస్తోంది.షోయబ్ మాలిక్ మేనేజర్, పాక్ మీడియాతో ఈ విషయం గురించి మాట్లాడిన మాటలు బయటికి వచ్చాయి.” అవును… సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు తీసేసుకున్నారు.సెపరేషన్స్‌కి సంబంధించిన పనులన్నీ ఇప్పటికే పూర్తియిపోయాయి…” అంటూ కామెంట్ చేశాడు మాలిక్ మేనేజర్.అయితే, పాకిస్తాన్ కు చెందిన మోడల్ తో షోయబ్ పెట్టుకున్న ఎఫైరే సానియా కాపురంలో చీలికలు తెచ్చిందని పాక్ మీడియా తెలుపుతుంది.

కొన్నాళ్ల క్రితం షోయబ్‌ మాలిక్‌కు సదరు మోడల్‌తో పరిచయమైందని, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఆమెతో చనువుగా దారి తీసిందనే ఈ రూమర్ సారాంశం.

ఆ మోడల్ మోజులో పడిన షోయబ్ మాలిక్.సానియాను పట్టించుకోవడం మానేశాడన్న వార్తలు షికారు చేస్తున్నాయి.ఆ మోడల్ తో కొన్ని నెలల క్రితం షోయబ్ ఫోటో షూట్ చేశాడు.

ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఆమె నటి మరియు యూట్యూబర్ అయేషా ఒమర్.

ఈ నటితో సన్నిహితంగా షోయబ్ ఉండటం వల్లే సానియా.అతన్ని దూరం పెట్టిందట.

నిజానికి సానియా, మాలిక్ మ‌ధ్య ఎటువంటి స‌మ‌స్య‌లు ఉన్నాయో ఇంకా స్ప‌ష్టంగా తెలియ‌దు.వారి ఇంతవరకు ఈ రూమర్స్ పై వివరణ ఇవ్వలేదు.

Shoaib Malik Affair with Pakistan Model Rumors Viral

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube