ఎండాకాలంలో అధిక ఎండలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి చాలామంది ప్రజలు ఎన్నో రకాల శీతల పానీయాలను తీసుకుంటూ ఉంటారు.కొంతమంది అయితే మార్కెట్లో లభించే ఎంతో హానికరమైన కూల్ డ్రింక్స్ కూడా తాగుతూ ఉంటారు.
నిజానికి ఇలా ప్రతిరోజు తాగడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.అయితే ఈ ఎండాకాలంలో శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు న్యాచురల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
వీటిలో అధిక మోతాదులో ఫైబర్, ప్రోటీన్లు ఉంటాయి.కాబట్టి ప్రతిరోజు ఈ డ్రింక్స్ ను తాగడం వల్ల అధిక వేడి కారణంగా వచ్చే వ్యాధులు దూరంగా దూరమవుతాయి.

అంతే కాకుండా వేసవిలో ఎక్కువగా చెరుకు రసం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల( Health benefits ) పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే ఇందులో సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.దీని కారణంగా డిహైడ్రేషన్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.అలాగే ఈ రసం తాగడం వల్ల ఇతర లాభాలు కూడా ఉన్నాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతి రోజు ఎండాకాలంలో చెరుకు రసం( sugarcane juice ) తాగడం వల్ల శరీరంలోని వేడి సులభంగా దూరమవుతుంది.
ఇందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, క్యాల్షియం, మాంగనీస్ శరీరంలోని వేడిని దూరం చేస్తాయి.

అంతేకాకుండా శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి.చెరుకు రసం తాగడం వల్ల మధుమేహం ( diabetes ) కూడా నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.అంతే కాకుండా ఇందులో ఉండే గుణాలు రక్తంలోని చక్కర పరిమాణాలను అదుపులో ఉంచుతాయి.
దీనివల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తగిన మోతాదులో చెరుకు రసాన్ని తీసుకోవచ్చు ఎండాకాలంలో ప్రతిరోజు పగటిపుట చెరుకు రసం తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.అయితే ఈ రసం కేవలం తాజాగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి.
లేకపోతే ఈ రసంలో ఉండే పోషకాలు తగ్గే అవకాశం ఉంది.ముఖ్యంగా చెప్పాలంటే ఎలాంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలైన అతిగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి ఎవరైనా సరే చెరుకు రసన్ని తగిన మోతాదులోనే తీసుకోవాలి.