ఆరోగ్యమే మహాభాగ్యం.ఎంత సంపన్నులు అయినా సరే ఆరోగ్యం సరిగ్గా లేకుంటే మనశ్శాంతి ఉండదు.
అందుకే ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉంటారు.అయితే ఆరోగ్యకరమైన జీవితాన్ని( Helathy Lifestyle ) పొందాలంటే డైట్ లో పోషకాలు నిండిన ఆహారాన్ని చేర్చుకోవడం ఎంతో అవసరం.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఫుడ్స్ ను రోజు ఉదయం తీసుకుంటే హై బీపీ నుండి అధిక బరువు వరకు ఎన్నో అనారోగ్య సమస్యలు పరార్ అవుతాయి.ఇంకెందుకు ఆలస్యం హెల్తీ లైఫ్ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు పెసలు వేసుకోవాలి.అలాగే ఐదు బాదం, రెండు డ్రై అంజీర్( Anjeer ), రెండు టేబుల్ స్పూన్లు నల్ల ఎండు ద్రాక్ష, రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగలు, రెండు ఎండు ఖర్జూరాలు వేసి ఒక కప్పు వాటర్ పోసి మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు నానబెట్టుకున్న వాటిని నేరుగా తినాలి.
ఇలా నానబెట్టుకున్న పెసలు, బాదం, వేరుశనగ, డ్రై అంజీర్, నల్ల ఎండు ద్రాక్ష మరియు ఎండు ఖర్జూరాల్లో( Dates ) ప్రోటీన్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం తో సహా ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.
వీటిని రోజూ ఉదయం తింటే అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.వెయిట్ లాస్ అవుతారు.బ్యాడ్ కొలెస్ట్రాల్) Bad Choelstrol ) కరుగుతుంది.గుండె ఆరోగ్యంగా మారుతుంది.

మెదడు చురుగ్గా పనిచేస్తుంది.జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి సామర్థ్యం పెరుగుతుంది.ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.జుట్టు రాలడం( Hairfall ) తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.కంటి చూపు రెట్టింపు అవుతుంది.రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.
దంపతుల్లో సంతాన సమస్యలు దూరం అవుతాయి.లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
సంతానోత్పత్తి రెట్టింపు అవుతుంది.రక్తహీనత దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.
రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా సైతం ఉంటారు.







