బయటకు బహిర్గతం అయ్యే శరీర భాగాల్లో పాదాలు ఒకటి.అందుకే తమ పాదాలు తెల్లగా మెరిసిపోతూ కనిపించాలని చాలా మంది కోరుకుంటారు.
ముఖ్యంగా మగువలు ఈ విషయంలో అస్సలు రాజీపడరు.ఈ క్రమంలోనే తరచూ బ్యూటీ పార్లర్ కు వెళ్లి వేలకు వేలు ఖర్చుపెట్టి పెడిక్యూర్ చేయించుకుంటారు.
కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలతోనే సులభంగా మరియు వేగంగా నల్లటి పాదాలను తెల్లగా మెరిపించుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి.దాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి.అన్నది ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ రెగ్యులర్ షాంపును వేసుకోవాలి.
ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ వైట్ టూత్ పేస్ట్ వేసి మిక్స్ చేయాలి.ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు, రెండు టేబుల్ స్పూన్లు శెనగ పిండి, నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు టమాటో జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు స్పూన్ తో మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత పాదాలను గోరు వెచ్చని నీటిలో శుభ్రంగా కడగాలి.అనంతరం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి ఐదు నిమిషాల ఎనిమిది నిమిషాల పాటు వదిలేయాలి.ఆపై అర నిమ్మ చెక్కను తీసుకుని సున్నితంగా పాదాలను కనీసం పది నిమిషాలు అయినా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.
స్క్రబ్బింగ్ కంప్లీట్ అయిన వెంటనే నార్మల్ వాటర్ తో శుభ్రంగా పాదాలను క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేస్తే పాదాలపై పేరుకుపోయి ఉన్న మురికి మృతకణాలు తొలగిపోతాయి.దీంతో నల్లటి పాదాలు తెల్లగా మరియు మృదువుగా మారతాయి.
వారంలో రెండు సార్లు ఈ రెమెడీని పాటించవచ్చు.