చిట్లిన జుట్టుతో బాధపడుతున్నారా? అయితే ఈ రెమెడీ మీ కోసమే!

సాధారణంగా కొందరి జుట్టు చివర్లు తరచూ చిట్టి పోతూ ఉంటుంది.చిట్లిన జుట్టును( Split hair ) ఎన్ని సార్లు కత్తిరించిన మళ్ళీ మళ్ళీ అదే సమస్య ఎదురవుతుంది.

 Best Remedy To Get Rid Of Split Ends Naturally Details! Home Remedy, Latest News-TeluguStop.com

దీంతో ఈ సమస్య నుంచి బయటపడడం కోసం రకరకాల షాంపూలను వినియోగిస్తుంటారు.తోచిన చిట్కాలు ప్రయత్నిస్తుంటారు.

అయినా సరే ఎలాంటి ఫలితం లేకుంటే ఏం చేయాలో తెలియక సతమతం అవుతుంటారు.ఈ జాబితాలో మీరు ఉన్నారా? అయితే అస్సలు బాధపడకండి.ఎందుకంటే చిట్లిన జుట్టును రిపేర్ చేయడానికి ఇప్పుడు చెప్పబోయే రెమెడీ ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.మ‌రి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాసుల వాటర్ పోయాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం, ( Rice ) వన్ టేబుల్ స్పూన్ బ్లాక్ టీ పౌడర్( Black tea powder ) వేసి కనీసం ప‌ది నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.

పూర్తిగా కూల్ అయిన అనంతరం ఆ వాటర్ లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు మీ రెగ్యులర్ షాంపూను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారంలో రెండు సార్లు ఈ విధంగా కనుక ఈ షాంపూ చేసుకుంటే చిట్లిన జుట్టు రిపేర్ అవుతుంది జుట్టు మళ్ళీ మళ్ళీ చిట్లకుండా సైతం ఉంటుంది.

అంతేకాదు ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు సిల్కీగా, షైనీగా మారుతుంది.హెయిర్ ఫాల్ స‌మ‌స్య అదుపులోకి వ‌స్తుంది.వైట్ హెయిర్ స‌హ‌జంగానే బ్లాక్ అవుతుంది.మరియు కురులు ఒత్తుగా పొడుగ్గా సైతం పెరుగుతాయి.కాబట్టి చిట్లిన జుట్టు తో బాధపడుతున్న వారు మాత్రమే కాదు ఎవరైనా ఏ రెమెడీని పాటించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube