Chiranjeevi : కెరీర్ పీక్ లో ఉన్న టైం లో చిరంజీవి తీసిన ఈ చిత్రం గురించి మీకు తెలుసా?

ఒక సుప్రీం హీరోగా ఎదిగిన చిరంజీవి( Chiranjeevi ) మాస్ సినిమాలు తీసి కమర్షియల్ గా సక్సెస్ అందుకుంటున్నారు.అలాంటి టైం లో ఎవరైనా రిస్క్ తీసుకోవాలని అనుకుంటారా అది తీసుకుంటే కనుక ఖచ్చితంగా పెద్ద రిస్క తీసుకున్నట్టే.

 Untold Facts About Chantabbai Movie-TeluguStop.com

కానీ తనికెళ్ల భరణి( Tanikella Bharani ) గారు ఒక సందర్భంలో ఓ మాట చెప్పారు రిస్క్ తీసుకోకపోవడం అన్నింటికన్నా పెద్ద రిస్క్ అని.ఆ మాట గుర్తొచ్చిందో ఏమో కానీ చిరంజీవి సాహసోపేతమైన ఒక పని చేశారు అది ఏంటి అంటే కమర్షియల్ సినిమాలు తీస్తూ ఒక కామెడీ చిత్రాన్ని తీయాలి అనుకోవడం.జంధ్యాల( Jandhyala ) కోరిక మేరకు మల్లాది రాసిన చంటబ్బాయి అనే నవలలను చిరంజీవిని హీరోగా పెట్టి సినిమా తీయాలి అనుకున్నాడు.అదే విషయాన్ని చిరంజీవితో చెప్పగా అతడు కూడా మరో మాట ఆలోచించకుండా ఓకే చెప్పాడు.

Telugu Chantabbai, Chiranjeevi, Gang, Jandhyala, Tollywood-Telugu Stop Exclusive

చంటబ్బాయి( Chantabbai ) నవల అప్పట్లో చాలా ఫేమస్.ఒక కామెడీ హీరో మంచి సెన్సాఫ్ హ్యూమర్ తో డిటెక్టివ్ పాత్ర పోషించడం ఈ నవల యొక్క స్పెషాలిటీ.చిరంజీవి కెరీర్ లో కూడా ఇలాంటి ఒక పాత్ర పడలేదు.చిరంజీవి ఎప్పుడైనా భిన్నమైన చిత్రాలు చేయడానికి ఒప్పుకుంటాడు.అందుకే అతని సినిమాల్లో గ్యాంగ్ లీడర్, విజేత, ఆరాధన, స్వయంకృషి, అంజి వంటి చిత్రాలు ఉన్నాయి.

Telugu Chantabbai, Chiranjeevi, Gang, Jandhyala, Tollywood-Telugu Stop Exclusive

పైగా నవలలను ఎక్కువగా తీసిన హీరోగా కూడా చిరంజీవికి గుర్తింపు ఉంది.అంతకు ముందు యండమూరి రాసిన ఎన్నో నవలలను ఆయన సినిమా రూపంలో నటించాడు మల్లాది రాసిన ఏకైక నవల చిత్రం చంటబ్బాయి మాత్రమే చిరంజీవి నటించిన చిత్రం.చిరంజీవి ఈ సినిమా ఒప్పుకోవడం ద్వారా అతనికి మరొక మైలురా ఇలాంటి చిత్రం చేరింది.

Telugu Chantabbai, Chiranjeevi, Gang, Jandhyala, Tollywood-Telugu Stop Exclusive

1984 సమయంలో చంటబ్బాయి సినిమా నవలగా వచ్చిన తరుణంలో ఆ నవల కాపీలు విపరీతంగా అమ్ముడయ్యాయి.చిరంజీవి తీసిన సినిమా కాబట్టి, అలాగే డిటెక్టివ్ నవలలో ఇదొక అయిన కారణంగా లక్షల్లో కాపీలు అమ్ముడుపోయాయని అప్పట్లో వార్తలు ఊపందుకున్నాయి.చంటబ్బాయి నవలను ఇప్పుడు విడుదల చేసినా కూడా ఎన్నో కాపీలు అమ్ముడుపోతాయి.అలా తన కెరీర్ ను సైతం రిస్క్ లో పెట్టి చిరంజీవి తీసిన ఈ సాహసోపేత సినిమా నిజంగా ఒక అద్భుతం అని చెప్పాలి.

ఈ చిత్రంలో సుహాసిని నటన కూడా ఎంతో చక్కగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube