టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్( Nag Aswin ) ఇటీవల కల్కి సినిమా( Kalki Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ప్రభాస్( Prabhas ) దీపికా పదుకొనే( Deepika Padukone ) హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 1200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది.
ఇకపోతే తాజాగా ఈ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఒక చిట్ చాట్ లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన కల్కి 2( Kalki 2 ) గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా మొదటి భాగం షూటింగ్ చేస్తున్నప్పుడు దీనిని ఒక భాగంగా తీయాలా లేకపోతే రెండు భాగాలుగా చేయాలా అని ఆలోచించాము.అయితే ఎలా తీయాలి అనే దానిని కూడా చీటీలు వేసి డిసైడ్ అయ్యామని తెలిపారు.ప్రభాస్ కెరియర్ లో సలార్ సినిమా డైనోసార్ అయితే కల్కి సినిమా డ్రాగన్ లాంటిది అంటూ నాగ్ అశ్విన్ తెలిపారు.ఇక కల్కి సినిమాలో కృష్ణుడి పాత్రలో నటించిన వ్యక్తి ఫేస్ కనిపించకుండా ఇందులో సందడి చేశారు.
అయితే ఆయన పాత్రకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చాయి.
ఇలా కృష్ణుడి పాత్రలో నటించినది మహేష్ బాబు( Mahesh Babu ) అంటూ కూడా కొందరు కామెంట్లు చేశారు.ఈ విషయం గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ… ఒకవేళ ఈ ప్రాజెక్టులో కనుక మహేశ్ బాబు లార్డ్ కృష్ణ పాత్రలో పూర్తి స్థాయిలో కనిపిస్తే, ఈ సినిమా రూ.2000 కోట్లు కలెక్ట్ చేసి, ఇది వరకెన్నడూ లేని విధంగా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచేదని పేర్కొన్నారు.అంతేకాకుండా ఒకవేళ కల్కి సీక్వెల్ లో ఫుల్ లెంగ్త్ దేవుడి పాత్ర కనుక ఊహించుకుంటే.పక్కా మహేశ్ బాబును( Mahesh Babu ) పెట్టేస్తానని చెప్పారు.ఇలా మహేష్ బాబు గురించి నాగ్ అశ్విన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.