ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.45
సూర్యాస్తమయం: సాయంత్రం 06.42
రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు
అమృత ఘడియలు: ఉ.6.30ల7.30, వరకు
దుర్ముహూర్తం: సా.12.47 నుంచి 01.37 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు చేసే వ్యాపారం లో కలిసి వస్తుంది.కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.మీ తోబుట్టువులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.
కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది.మిత్రుల నుండి మంచి మాటలు వింటారు.
వృషభం:

ఈరోజు మీరు మీ శ్రీమతి తో కుటుంబ సమస్యలు చర్చిస్తారు.కుటుంబాల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.స్నేహితుల ద్వారా కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.చాలా సంతోషంగా గడుపుతారు.
మిథునం:

ఈరోజు మీ కుటుంబంలో వడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది.
ఈరోజు మీ సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేశారు.చాలా ఒత్తిడి గా ఉంటుంది.
కర్కాటకం:

ఈరోజు మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి చేతికందుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.మీ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు.స్నేహితుల ద్వారా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
సింహం:

ఈరోజు మీరు ఉద్యోగపరంగా ఇంత వరకు ఎదురుకుంటున్న కొన్ని సమస్యల నుండి బయట పడతారు.ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు.విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది.ఇల్లు కాని స్థలం కోనాలని ఆలోచనలు చేస్తారు.చాలా సంతోషంగా గడుపుతారు.
కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.రావాల్సిన డబ్బు సరైన సమయానికి చేతికందదు.మీరు ఇవ్వాల్సిన డబ్బు కు ఒత్తిడి పెరుగుతుంది.
శుభకార్యాల్లో భారీగా ఖర్చు అవుతుంది.కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.
తులా:

ఈరోజు మీకు అనవసరమైన పరిచయాలు పెరుగుతాయి.కోర్టు సమస్యలు ఎదుర్కొంటారు.బంధువులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.విదేశీ ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీ తోబుట్టువులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.
వృశ్చికం:

ఈరోజు మీకు ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది.శుభ కార్యాలలో అధికంగా డబ్బులు ఖర్చు చేస్తారు.
కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.స్నేహితుల ద్వారా సమస్యల నుండి బయటపడతారు.
ధనస్సు:

ఈ రోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు.రావాల్సిన డబ్బులు సరైన సమయానికి చేతికందదు.సొంత నిర్ణయాలు ఆలోచనలు తీసుకోకుండా కుటుంబ సభ్యులతో సలహాలు తీసుకోవడం మంచిది.స్నేహితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.
మకరం:

ఈరోజు మీరు ఏ పని చేసిన సక్రమంగా సాగుతుంది.కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీ స్నేహితుల ద్వారా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.
కుంభం:

ఈరోజు మీరు అప్పు తీరుస్తారు.మీరు ఏ పని చేసిన త్వరగా పూర్తవుతుంది.మీ కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు.రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది.స్నేహితులతో కలిసి యాత్రలకు వెళ్ళాలి అనుకుంటారు.
మీనం:

ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.బంధువులతో కలిసి యాత్రలకు వెళ్తారు.స్నేహితుల ద్వారా అడ్డంకులు ఎందుకుంటారు.
పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండాలి.చెడు అలవాట్లను మానుకోవడం మంచిది.