మహిళా భక్తులకు, నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన టీటీడీ..!

తిరుమల తిరుపతి పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.మొత్తం రూపాయలు 5141.74 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్ కు( TTD Annual Budget ) ఆమోదం ముద్ర పడింది.అయితే హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా బంగారు మంగళ సూత్రాలు, లక్ష్మీకాసులు భక్తులకు విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది.

 Ttd Annual Budget Proposals Key Decisions Announcement Details, Ttd Annual Budge-TeluguStop.com

అయితే టీటీడీ ఉద్యోగుల( TTD Employees ) ఇళ్ల స్థలాల్లో గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం లభించింది.లడ్డు ట్రే మోసే కార్మికుల వేతనాలు రూపాయలు 15000 అదనంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

టీటీడీ బోర్డు సమావేశంలో భక్తుల కోసం ముఖ్య నిర్ణయాలు కూడా తీసుకున్నారు.

Telugu Lakshmi Kasulu, Mangalasutras, Tirumala, Tirumala Temple, Ttdbudget, Ttdc

ధర్మ ప్రచారంలో భాగంగా బంగారు డాలర్లు తరహాలో శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళ సూత్రాలను భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి( TTD Chairman Bhumana Karunakar Reddy ) తెలిపారు.మహిళల కోసం మంగళసూత్రాలు, లక్ష్మీకాసులు తయారు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.లభాపేక్ష లేకుండా మంగళసూత్రాలు, లక్ష్మీకాసులు విక్రయిస్తామని చెప్పారు.

హైందవ స్త్రీలకు( Hindu Women ) ఈ మంగళ సూత్రాలు లక్ష్మీకాసులు ఒక మూల్యమైన కానుక అని చెప్పారు.ఇక వేద పాఠశాలలో 51 మంది సంభావన అధ్యాపకుల వేతనాలు 34 వేల నుండి 54 వేలకు పెంచాలని కూడా నిర్ణయించారు.

Telugu Lakshmi Kasulu, Mangalasutras, Tirumala, Tirumala Temple, Ttdbudget, Ttdc

ఇక టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 60 ఆలయాల్లో పనిచేసేందుకు నూతనంగా కొన్ని పోస్టులు కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది.3,4,5 తేదీలో కార్మిక సదస్సును కూడా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ తెలిపారు.ఇందులో 57 మంది ముఠా,పీఠాధిపతులు హాజరుకానున్నారు.వారి సలహాలు, సూచనలు తీసుకొని అమలు చేస్తామని కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.ఇక ఈ సమావేశంలో స్విమ్స్ ఆస్పత్రిలో 300 పడకల నుండి 1200 పడకాల పెంపు 148 కోట్లతో టెండర్ ఆమోదం తెలిపారు.ఇక రూపాయిలు 2.5 కోట్లతో సప్తగిరి సత్రంలో అభివృద్ధి పనులు కూడా చేపట్టనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube