ఎవరికీ తెలియని ఈ మంత్రాన్ని.. ఇలా చదివితే సకల రోగాలు దూరమై..!

శరభేశ్వరుడు( Sharabheswara ) శివుని యొక్క ఉగ్రరూపం అని చాలామందికి తెలియదు.ఆయన విష్ణు యొక్క నరసింహ అవతారాన్ని శాంతింప చేయడానికి ఈ రూపాన్ని తీసుకున్నాడు.

 Recite This Sharabheswara Mantra To Get Rid Of All Types Of Diseases Details, S-TeluguStop.com

విష్ణువు తన యువ భక్తుడైన ప్రహ్లాదుని( Prahlada ) తన నిరంకుశ తండ్రి రాక్షస రాజు హిరణ్యకశిపుడి నుంచి రక్షించడానికి నరసింహ అని పిలవబడే క్రూరమైన సగం సింహం, సగం మానవుడిగా అవతరించాడు.రాక్షస రాజుకు తన కొడుకు విష్ణువు భక్తితో ఉన్న విషయం నచ్చలేదు.

అతను కొడుకు ను చంపడానికి చాలా సార్లు ప్రయత్నించాడు.కానీ విష్ణువు అనుగ్రహం వల్ల చంపలేకపోయాడు.

చివరగా ప్రహ్లాదుని రక్షించడానికి విష్ణువు నరసింహ అవతారం లో ఉద్భవించాడు.నరసింహుడు తన రాజ భవనం గుమ్మంలో రాక్షసుడిని సంహరించాడు.హిరణ్యకశిపుని( Hiranyakashyapa ) సంహరించిన తర్వాత నరసింహుని ఉగ్రత తగ్గలేదు.ఇతర దేవతలు కూడా అతనిని శాంతింప చేయలేకపోయారు.

నరసింహుని ఉగ్రత వల్ల విశ్వమంతా ఆపదలో ఉన్నట్లు అనిపించింది.ఆ సమయంలో శివుడు శరభేశ్వరుడు రూపాన్ని తీసుకున్నాడు.

Telugu Bhakti, Devotional, Hiranyakashyapa, Maha Shiva, Maha Vishnu, Simha, Prah

ఇది మానవుడు, పక్షి మరియు సింహం కలిపినా ఒక భయంకరమైన జీవి.దానికి ఎనిమిది కాళ్లు, రెండు రెక్కలు, నాలుగు చేతులు, పదునైన దంతాలు గోళ్లు ఉంటాయి.నరసింహుడిని( Narasimha ) శాంతించే వరకు ఇద్దరూ చాలాసేపు పోరాడారనీ వేదాలు పురాణాలు చెబుతున్నాయి.లింగ పురాణంలో వేదవ్యాస శరబేశ్వరుడిని మహర్షి పూజించిన వారు అనేక రకాల బాధల నుంచి ఉపశమనం పొందుతారని వెల్లడించారు.

Telugu Bhakti, Devotional, Hiranyakashyapa, Maha Shiva, Maha Vishnu, Simha, Prah

దేవాదిదేవాయ జగన్మయాయ శివాయ నాలీకనిభాననాయ,శర్వాయ భీమాయ శరాధిపాయ నమోస్తు తుభ్యం శరభేశ్వరాయ సర్వాయ,హరాయ భీమాయ హరిప్రియాయ భవాయ శాంతాయ పరాత్పరాయ,మృడాయ రుద్రాయ విలోచనాయ నమోస్తు తుభ్యం శరభేశ్వరాయ,శీతాంశుచూడాయ దిగంబరాయ సృష్టి స్థితి ధ్వంసనకారణాయ,జటాకలాపాయ జితేంద్రియాయ నమోస్తు తుభ్యం శరభేశ్వరాయ,కలంకకంఠాయ భవాంతకాయ కపాలశూలాత్తకరాంబుజాయ,భుజంగభూషాయ పురాంతకాయ నమోస్తు తుభ్యం శరభేశ్వరాయ శరభేశ్వరాయ.ఈ మంత్రాన్ని 21 సోమవారాల పాటు ఒక పూట దీక్ష పాటిస్తూ చదవాలి.అలాగే 21 సోమవారాలు సాయంత్రం శివాలయం వెళ్లి కొబ్బరికాయ కొట్టడం వల్ల ఈ దీక్ష పూర్తి అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube