అయ్యప్ప కాళ్లకు బంధం ఎందుకు ఉంటుందో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే హిందూ దేవుళ్లకు ఎంతో చరిత్ర ఉంది అని దాదాపు చాలా మందికి తెలుసు.అందులో అయ్యప్ప స్వామి( Ayyappa Swami ) విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Do You Know Whyayyappa Swamis Legs Are Bound Ayyappa Swami , Narada Maharshi ,-TeluguStop.com

ముఖ్యంగా అయ్యప్ప స్వామి మహిమ కోసం అయ్యప్ప స్వామి భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు.అందుకోసమే అయ్యప్ప మాలను ధరిస్తారు.

అలాగే దాదాపు 40 రోజులు కఠోర దీక్షను చేపడతారు.నిష్టతో ఉంటారు.

ఆ తర్వాత స్వామి కొలువై ఉన్న శబరిమలకు వెళ్లి తమ దీక్షను తొలగించి స్వామిని వేడుకుని తిరిగి తమ ఇళ్లకు వస్తారు.అయితే అయ్యప్ప స్వామి కాళ్లకు బంధం ఎందుకు ఉంటుందో చాలామందికి తెలియదు.

ఆయన కాళ్లకు ఉన్న పట్టిలను ఎప్పుడైనా గమనించారా? అసలు అవి ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి వెనుక ఉన్న అర్థం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Ayyappa Swami, Devotional, Kerala, Maharshi, Pandala Raju, Sabarimala-Tel

స్వామి గురించి పూర్తిగా తెలిసిన వాళ్లకు పట్టిల గురించి కూడా తెలిసే ఉంటుంది.అయ్యప్ప స్వామి పందల రాజు వద్ద 12 సంవత్సరాలు పెరిగాడు.ఆ తర్వాతే తను హరి హరిహరసుతుడను అని అయ్యప్ప తెలుసుకుంటాడు.

అయితే ధర్మాన్ని గెలిపించడం కోసమే తను జన్మించానని తను హరిహరసుతుడను అని అయ్యప్ప నారద మహర్షి ద్వారా తెలుసుకుంటాడు.వెంటనే మహార్షిని ఆవహిస్తాడు.ఆ తర్వాతే శబరిమల( Sabarimala ) దేవాలయంలో జ్ఞానపీఠం పై అధిష్టిస్తాడు.అదే సమయంలో 18 మెట్ల మీద కూర్చుని ఉన్న అయ్యప్ప స్వామిని చూడడానికి అప్పుడే పందల రాజు వస్తాడు.

రాజు రాగానే అయ్యప్ప స్వామి లేచి నిలబడేందుకు ప్రయత్నిస్తాడు.

Telugu Ayyappa Swami, Devotional, Kerala, Maharshi, Pandala Raju, Sabarimala-Tel

అప్పుడు పట్టు తప్పి అయ్యప్ప స్వామి కింద పడిపోతాడు.దీంతో పందల రాజు( Pandala Raju ) అయ్యప్ప స్వామి కాళ్లకు పట్టిలు కడతాడు.దీంతో స్వామి కింద పడడు.

ఎప్పుడూ నువ్వు ఈ పట్టీలు వేసుకొని ఉండాలి అని పందల రాజు అయ్యప్ప స్వామిని కోరుతాడు.దీంతో అప్పటి నుంచి అయ్యప్ప స్వామి పట్టిలు వేసుకొని ఉన్నాడని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube