అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ఈ -కానిక తో ఎక్కడి నుంచైనా అయ్యప్పకు కానుకలు..!

అయ్యప్ప భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం( Travan Core Temple ) బోర్డు గుడ్ న్యూస్ చెప్పిందని కచ్చితంగా చెప్పవచ్చు.ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ నుంచి అయినా అయ్యప్పకు భక్తులు కానుకలు పంపేలా ఈ కానిక వెబ్ సైట్ మొదలుపెట్టింది.

 Good News For Ayyappa Devotees Gifts To Ayyappa From Anywhere With This - Kanika-TeluguStop.com

ప్రముఖ ఐటీ సంస్థ టిసిఎస్ ఈ వెబ్ సైట్ లో రూపొందించినట్లు దేవాలయ బోర్డ్ అధ్యక్షుడు అనంత గోపాలన్( Anantha Gopalan ) తెలిపారు.ఈ వెబ్ సైట్ అందుబాటులోకి రావడంతో అయ్యప్ప దేవాలయానికి వచ్చే ఆదాయం పెరుగుతుందని దేవాలయ ముఖ్య అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

అయితే వెబ్ సైట్ ప్రారంభమైన తర్వాత మొదటి కానుకను టిసిఎస్ సీనియర్ జనరల్ మేనేజర్ సమర్పించారు.

Telugu Anantha Gopalan, Ayyappa, Bhakti, Devotional, Kanika, Sabarimala-Telugu B

శబరిమల క్షేత్రాన్ని( Sabarimala ) జూన్ 15న తెరవనున్నారు.ఆ తర్వాత రోజు నుంచి నాలుగు రోజులపాటు స్వామి సన్నిదానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.గతంలో శబరిమల దేవాలయ వర్చువల్ క్యూ విధానాన్ని ప్రవేశపెట్టింది.

అయితే బుకింగ్ మాత్రం కేరళ పోలీసులకు అప్పగించింది.తర్వాత ఈ సేవలను దేవస్థానమే నిర్ణయించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ వర్చువల్ క్యూ బుకింగ్ విధానానికి సంబంధించిన వెబ్ సైట్ పనులను కూడా టిసిఎస్ కు అప్పగిస్తూ దేవాలయ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది.వచ్చే నెలలో ఈ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.

Telugu Anantha Gopalan, Ayyappa, Bhakti, Devotional, Kanika, Sabarimala-Telugu B

ఇంకా చెప్పాలంటే 2022లో అయ్యప్ప దేవాలయానికి భారీగా ఆదాయం వచ్చింది.దాదాపు 318 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చినట్లు దేవాలయ ముఖ్య అధికారులు వెల్లడించారు.గత సంవత్సరం వచ్చిన ఆదాయం శబరిమల దేవాలయ చరిత్రలోనే అత్యధికమని దేవాలయ అధికారులు వెల్లడించారు.అంతకు ముందు 2018లో 260 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు గుర్తు చేసుకున్నారు.

కరోనా సంక్షేమం తర్వాత గత అయ్యప్ప సీజన్ లోనే భక్తులను పూర్తిస్థాయిలో అనుమతించారు.ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు దర్శనానికి తరలివచ్చారు.దీంతో అధిక ఆదాయం వచ్చింది.ఒక్క కాయిన్స్ రూపంలోనే స్వామి ఆదాయం ఏడు కోట్ల వరకు వచ్చిందని అధికారులు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube