ముఖ్యంగా చెప్పాలంటే సూర్యుడు ఉదయించక ముందే నక్షత్రాలు ఇంకా అక్కడక్కడ కనిపిస్తూ ఉండగానే కార్తిక మాసంలో నదీ స్నానం ఆచరించాలని ఈ పండితులు( Scholars ) చెబుతున్నారు.కార్తిక మాసంలో సూర్యాదానికి ముందే స్నానం చేయడానికి ఒక విశేషం ఉంది.
సహజంగానే కార్తీక మాసం అంటే చలి ఎక్కువగా ఉండే సమయం అని దాదాపు చాలామందికి తెలుసు. జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తుల రాశిలో ఉంటాడు.
సూర్యునికి ఇది నీచ స్థానం.ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసం ప్రజల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.
ఈ మాసంలో జీర్ణశక్తి ( Digestive power )తగ్గుతుంది.చురుకుతనం తగ్గుతుంది.
బద్ధకం పెరుగుతుంది.

ఇంకా చెప్పాలంటే శరీరంలో నొప్పులు ఎక్కువగా అవుతాయి.ముడుచుకొని పడుకోవడం వల్ల నొప్పులు ఇంకా పెరుగుతాయి.ఇంకా చెప్పాలంటే కార్తీక మాసంలో( Kartika Snanam ) తొందరగా నిద్ర లేవడం వల్ల సహజంగా వచ్చే రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఈ మాసంలో ప్రతిరోజు స్నానం, దైవపూజ చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాకుండా మానసికంగా ఉల్లాసంగా కూడా ఉంటారు.నది వరకు నడవాలి.ఇది కూడా వ్యాయామమే.ప్రవహించే నదిలో సహజంగా ఉండే ఔషధాలే కాకుండా పరీవాహక ప్రదేశాలలో ఉండే ఔషధాలు కూడా నీటిలో కలుస్తాయి.

నీటిలో స్నానం చేయడం కూడా ఆరోగ్యానికి( Health ) ఎంతో మంచిది.మనకు చాలా సంతోషాన్ని ఇస్తాయి.నవంబర్ నెల నాటికి వర్షాలు తగ్గిపోతాయి.మలినాలు అడుగుకి చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తుంది.సమృద్ధిగా ఇటు స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేసేందుకు కార్తీకమాసమే సరైన సమయం అని పెద్దవారు చెబుతూ ఉంటారు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నీటి మీద, మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతంగా ఉంటాడు.అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌముది మాసం అని కూడా పిలుస్తారు.
చంద్ర కిరణాలతో, ఔషధాలతో రాత్రంతా ఉన్న నీటిలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు( Health problems ) దరిచేరవు అని కూడా చెబుతున్నారు.