ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం( Andhra Pradesh )లోని తిరుమల పుణ్య క్షేత్రానికి ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు( devotees ) తరలి వచ్చి స్వామి వారికి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తూ ఉంటారు.అలాగే మరి కొంత మంది భక్తులు తల నిలలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల శ్రీవారి ( Tirumala Srivari )భక్తులకు దేవస్థానం క్యూ లైన్ లో వేచి ఉండే అవసరం లేకుండా శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం కలిగించింది.ఎందుకంటే నిన్న ఒకరోజు కాస్త భక్తుల ప్రతి తగ్గడం వల్ల ఇలా దర్శనం చేసుకునే అవకాశం లభించింది.
దీంతో తిరుమల వైకుంఠం కాంప్లెక్స్ లో వేచి ఉండే అవసరం లేకుండా శ్రీవారి దర్శనం చేసుకున్నారు.అలాగే టోకెన్లు( Tokens ) లేని భక్తులు ఐదు గంటల్లోనే శ్రీవారి దర్శనం చేసుకున్నారు.ఇక నిన్న ఒక్క రోజే దాదాపు 72,000 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.అంతే కాకుండా నిన్న ఒక్క రోజే స్వామి వారికి దాదాపు 26 వేల మంది భక్తులు తల నీలలు సమర్పించారు.ఇంకా చెప్పాలంటే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నిన్న ఒక్కరోజే 4.5 కోట్లు అనీ దేవాలయ ప్రముఖ అధికారులు వెల్లడించారు.ఇది ఇలా ఉండగా తిరుపతిలో( Tirupati ) ఇవాల్టి నుంచి దర్శనం టోకెన్లు నిలిపివేస్తారని టీటీడీ ( TTD )పాలక మండలి వెల్లడించింది.
ఇంకా చెప్పాలంటే తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా ఈ రోజు, 13, 14, 15వ తేదీలలో తిరుపతిలో జారీ చేసే సర్వ దర్శనం టోకెన్లు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.ఇంకా చెప్పాలంటే తిరుమలలో 14వ తేదీన నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుందని దేవాలయ ముఖ్య అధికారులు వెల్లడించారు.అలాగే అక్టోబర్ 9వ తేదీన టీటీడీ పాలక మండలి సమావేశం కానుందని, ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ( TTD Chairman Bhumana Karunakar Reddy )ఈ భేటీలో పలు కీలక అంశాలతో పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాల పైన చర్చ జరుపుతున్నట్లు చెబుతున్నారు.
LATEST NEWS - TELUGU