ఫైబర్ నెట్ ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని టీడీపీ నేత పయ్యావుల అన్నారు.ఈ ప్రాజెక్టుతో రూ.900 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు.
ప్రాజెక్టును అమలు చేసిన మిగిలిన అధికారుల పేర్లను ఎందుకు ప్రస్తావించలేదని పయ్యావుల ప్రశ్నించారు.
టెరాసాఫ్ట్ కు క్వాలిఫికేషన్ ఉందని సిగ్నం సంస్థ ప్రతినిధి సర్టిఫై చేశారన్నారు.టెరాసాఫ్ట్ కంపెనీకి టెండర్ దక్కే నాటికి ఆ సంస్థ బ్లాక్ లిస్టులో లేదని వెల్లడించారు.
ఈ క్రమంలో ప్రాజెక్టులో అవినీతి జరిగే అవకాశం లేదన్న ఆయన టీడీపీ నేతలపై కావాలనే వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆరోపణలు చేశారు.