ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవినీతి జరగలేదు..: పయ్యావుల

ఫైబర్ నెట్ ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని టీడీపీ నేత పయ్యావుల అన్నారు.

ఈ ప్రాజెక్టుతో రూ.900 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు.

ప్రాజెక్టును అమలు చేసిన మిగిలిన అధికారుల పేర్లను ఎందుకు ప్రస్తావించలేదని పయ్యావుల ప్రశ్నించారు.

టెరాసాఫ్ట్ కు క్వాలిఫికేషన్ ఉందని సిగ్నం సంస్థ ప్రతినిధి సర్టిఫై చేశారన్నారు.టెరాసాఫ్ట్ కంపెనీకి టెండర్ దక్కే నాటికి ఆ సంస్థ బ్లాక్ లిస్టులో లేదని వెల్లడించారు.

ఈ క్రమంలో ప్రాజెక్టులో అవినీతి జరిగే అవకాశం లేదన్న ఆయన టీడీపీ నేతలపై కావాలనే వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆరోపణలు చేశారు.