ప్రొస్టేట్‌ క్యాన్సర్.. పురుషుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్ర‌త్త ప‌డాల్సిందే!

మ‌హిళ‌ల‌తో పోలిస్తే పురుషుల్లో క్యాన్స‌ర్ వ‌చ్చే రిస్క్ కాస్త త‌క్కువే.కానీ, ఈ మ‌ధ్య కాలంలో ప్రొస్టేట్‌ క్యాన్సర్ బారిన ప‌డుతున్న పురుషుల సంఖ్య‌ భారీగా పెరిగిపోతోంది.

 Prostate Cancer Symptoms! Prostate Cancer Symptoms, Prostate Cancer, Symptoms, C-TeluguStop.com

ప్రోస్టేట్ అంటే వీర్య గ్రంథి.ఈ గ్రంథిలో ఏర్ప‌డే క్యాన్స‌ర్‌నే ప్రొస్టేట్ క్యాన్స‌ర్ అంటారు.

ముందే గుర్తించి చికిత్స తీసుకుంటే గ‌నుక చాలా త్వ‌ర‌గా ప్రొస్టేట్‌ క్యాన్సర్ నుంచి విముక్తి పొందొచ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ప్రొస్టేట్‌ క్యాన్సర్ వ‌ల్ల పురుషుల్లో ఏయే ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో ఓ చూపు చూసేయండి.

ప్రొస్టేట్‌ క్యాన్సర్ బారిన ప‌రుషులు మూత్ర విసర్జన స‌మ‌యంతో తీవ్రంగా ఇబ్బంది ప‌డుతుంటారు.మూత్రం ప్రవాహంలో వేగం తగ్గి పోవ‌డం, మూత్రంలో రక్తం పడడం వంటి ల‌క్ష‌ణాలూ క‌నిస్తాయి.

అలాగే ఎముకల్లో నొప్పి, వెన్ను నొప్పి, పొత్తి క‌డుపు నొప్పి, కీళ్ల వాపు వంటివి త‌ర‌చూ ఇబ్బంది పెడ‌తాయి.

ఉన్నట్టుండి బ‌రువు త‌గ్గి పోవ‌డం, లేదా పెరిగి పోవ‌డం కూడా ప్రొస్టేట్‌ క్యాన్సర్ ల‌క్ష‌ణాలుగా చెప్పు కోవ‌చ్చు.

ఇక క్యాన్సర్ ముదిరే కొద్ది అంగ స్తంభన సమస్యలు ఏర్ప‌డ‌తాయి.ఇటు వంటి ల‌క్ష‌ణాలు గ‌నుక క‌నిపిస్తే ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వైద్యుల‌ను సంప్ర‌దించాలి.

క్యాన్స‌ర్ ప్రారంభ ద‌శ‌లో ఉంటే వైద్య నిపుణులు మందుల‌తోనే త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తారు.ఒక వేళ క్యాన్స‌ర్ వ్యాధి ముదిరితే గ‌నుక రేడియో థెరఫీ, కిమో థెరపీ, హర్మోన్ థెరపీ వంటి చికిత్సలు అందించి క్యాన్స‌ర్‌ను అరిక‌ట్టేందుకు ప్ర‌య‌త్నిస్తారు.

ఇక‌ పొర పాటున‌ మీరు ల‌క్ష‌ణాల‌ను నిర్ల‌క్ష్యం చేస్తూ ఇంట్లోనే ఉంటే క్యాన్స‌ర్ ప్రొస్టేట్ గ్రంథి దాటి ఇత‌ర భాగాల‌కు వేగంగా పాకేస్తుంది.ఫ‌లితంగా ప్రాణాలే రిస్క్‌లో ప‌డ‌తాయి.

కాబ‌ట్టి, పైన చెప్పుకున్న ప్రొస్టేట్‌ క్యాన్సర్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే జాగ్ర‌త్త ప‌డండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube