కన్నడ సినిమా పరిశ్రమ నుండి వచ్చి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కే జి ఎఫ్ సినిమా.ఇక భారీ కలెక్షన్లు కూడా రాబట్టి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇటీవలే ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా అంతకు మించిన విజయాన్ని సాధించింది.థియేటర్లలో ఈ సినిమా హవా కొనసాగుతూ ఉండడం గమనార్హం.
ఇక ప్రస్తుతం కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది అని చెప్పాలి.అయితే ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ హీరో యష్ గురించి మాత్రమే కాదు సరిగ్గా మీసాలు కూడా రాని కుర్ర ఎడిటర్ గురించి సినిమాటోగ్రఫీ చేసిన భువన్ గురించి వడ్రంగి పని చేస్తూ మ్యూజిక్ ఇచ్చిన రవి గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు.
ఈ ముగ్గురు కూడా ప్రస్తుతం ప్రశాంత నీల్ యష్ తర్వాత ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నారు అని చెప్పాలి.అయితే కే జి ఎఫ్ సినిమా ను ఎలివేట్ చేసింది సినిమాకు ప్రాణం పోసింది రవి అందించిన మ్యూజిక్ అనే చెప్పాలి.వడ్రంగి పని చేసుకునే రవి టాలెంట్ చూసి ప్రశాంత్ నీల్ అతనికి అవకాశం ఇచ్చాడు.దేవుడు పాటలు మ్యూజిక్ ఆల్బమ్స్ చేసే రవికి ఏకంగా కే జి ఎఫ్ సినిమా ఆఫర్ రావడంతో లైఫ్ మొత్తం ఒక్కసారిగా టర్న్ అయ్యింది.
సినిమా హిట్ అవడానికి రవి ఇచ్చిన మ్యూజిక్ ఒక కారణంగా చెప్పాలి.ఇక ప్రశాంత్ నీల్ నిజం విజన్ ను బాగా క్యారీ చేసింది సినిమాటోగ్రాఫర్ భువన్.
వాచ్ రిపేర్ షాప్ లో పనిచేసే భువన్ ను తన తండ్రి స్నేహితుడి వద్ద ఫోటోలు తీయడం నేర్చుకుని స్టీల్ ఫోటోగ్రాఫర్గా మారిపోయాడు.
అలాంటి భువన్ టాలెంట్ చూసిన ప్రశాంత్ నీల్ వెనకా ముందు ఆలోచించకుండా ఏకంగా అతనికి కేజిఎఫ్ లో అవకాశం ఇచ్చాడు.సినిమా ఎంత గొప్పగా తీసిన దాని కరెక్ట్ గా ఎడిట్ చేయడం చాలా ముఖ్యం.అందుకే ఎడిటింగ్లో ఉద్దండులను మాత్రమే పెద్ద సినిమాలకు పెట్టుకుంటాడు కానీ ప్రశాంత్ నీల్ మాత్రం 19 ఏళ్ల కుర్రాడు ఉజ్వల్ కులకర్ణి చేసిన చిన్న చిన్న వీడియో ఎడిట్ చూసి అతనికి అవకాశం ఇచ్చేస్తాడు.
ఇప్పుడు 19 ఏళ్ల కుర్రాడు ఇంకా మీసాలు కూడా సరిగ్గా రాని కుర్రాడు తన టాలెంట్ ఏమిటో నిరూపించాడు.ఈ ముగ్గురి గురించి తెల్సిన తర్వాత ప్రశాంత్ నీల్ మామూలోడు కాదు ఈ ముగ్గురిని భలే పట్టాడు అని అనుకుంటున్నారు ప్రేక్షకులు.