గత రెండేళ్లుగా కోవిడ్ మహమ్మరి కారణంగా కఠినమైన ఆంక్షలు అమల్లో వుండటంతో మనుషులు నాలుగు గోడలకే పరిమితమయ్యారు.ఉత్సవాలు, వేడుకలు, పండుగలు ఇతరత్రా కార్యక్రమాలకు హాజరు కాలేకపోయారు.
ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా మారడంతో జనం బహిరంగ వేడుకల్లో పాల్గొంటున్నారు.దీనిలో భాగంగా కెనడాలోని సిక్కు కమ్యూనిటీ వైశాఖీ వేడుకలను ఘనంగా జరుపుకుని.
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది.వాంకోవర్‌లోని చారిత్రాత్మక రాస్ స్ట్రీట్ గురుద్వారాలో ఈ ఏడాది వైశాఖి వేడుకలు జరిగాయి.
దీనిని శనివారం 10 వేలమంది సంగత్ సభ్యులు సందర్శించారని అంచనా.
అయితే సాంప్రదాయ ఖల్సా డే పరేడ్ మాత్రం ఈ ఏడాది జరగలేదు.
ఈ సందర్భంగా సొసైటీ ప్రెసిడెంట్ మల్కియాత్ సింగ్ ధామి మాట్లాడుతూ… తాము ఈ ఏడాది వైశాఖి వేడుకలను నిర్వహించడం సంతోషంగా వుందన్నారు.అయితే కోవిడ్ కారణంగా తాము ముందస్తుగా ప్లాన్ చేయలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పరేడ్‌ను మరో చోటికి తరలించడానికి సమయం పడుతుందని.సమయాభావం వల్ల తాము అలా చేయలేకపోయామన్నారు.
ఇంకా ఘనంగా వేడుకలు జరుపుకోవాలని భావించామని… కానీ కాంపౌండ్ పరిధిలోనే నిర్వహించామని ధామి చెప్పారు.
ఈ వేడుకలకు హాజరైన కెనడా అంతర్జాతీయ అభివృద్ధి మంత్రి హర్జిత్ సజ్జన్ మాట్లాడుతూ.దాదాపు రెండేళ్ల తర్వాత .ఈ రోజు సిక్కు కమ్యూనిటీతో కలిసి సౌత్ వాంకోవర్‌లో వైశాఖీ జరుపుకోవడం ఆనందంగా వుందన్నారు.ఫెడరల్ ఎంపీలు, ప్రావిన్షియల్, మునిసిపల్ నేతలు, వాంకోవర్‌లోని భారత కాన్సుల్ జనరల్ కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు.