వైఎస్‌ వివేకా హత్య కేసు మళ్లీ చల్లబడింది ఏంటి సర్‌?

మాజీ మంత్రి వైఎస్ వివేక ( YS Viveka )హత్య కేసులో గత వారం తెగ హడావుడి జరిగింది.అధికార పార్టీ నాయకులను వరుసగా ప్రశ్నించడంతో పాటు ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సిబిఐ అధికారులు దూకుడుగా వ్యవహరించారు.

 Ys Vivekananda Reddy Murder Case , Ys Vivekananda Reddy, Avinash Reddy, Telugu D-TeluguStop.com

అంతే కాకుండా హత్యకు పాల్పడిన వారిని గుర్తించినట్లుగానే సిబిఐ అధికారులు ఆఫ్ ది రికార్డు పేర్కొన్నారు.మొన్నటి వరకు సిబిఐ అధికారుల వరుస విచారణ అవినాష్ రెడ్డి( Avinash Reddy ) బెయిల్ పిటీషన్‌ ఇలా ప్రతి ఒక్క వ్యవహారం వివేకా హత్య కేసు ముగింపు దశకు వచ్చినట్లే అనుకునేలా చేసింది.

కానీ ఇంతలోనే హడావుడి అంతా కనుమరుగయ్యింది.అదిగో ఇదిగో అంటూ ప్రచారం జరిగిన వివేక హత్య కేసు విషయంలో ఇప్పుడు ఆ సందడి కనిపించడం లేదు.

అవినాష్ రెడ్డి అరెస్ట్ లేక పోవడంతో అసలు వివేక హత్య కేసు విచారణ జరుగుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Telugu Telugu, Ys Viveka, Ysrcp-Politics

గత వారం జరిగిన హడావుడికి ప్రస్తుతం ఉన్న పరిస్థితికి అస్సలు పొంతన లేదేం అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.సోషల్ మీడియాలో వివేకా హత్య గురించి రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఒక వైపు సిబిఐ( CBI ) విచారణ జరుగుతుండగా మరో వైపు రాజకీయ సందడి కూడా మొదలైంది.

వివేకా హత్య కేసు వల్ల అధికార వైకాపా కచ్చితంగా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.దాంతో తమకు ప్రయోజనం చేకూరుతుంది అంటూ తెలుగుదేశం పార్టీ ( Telugu Desam Party )నాయకత్వం ఆనందం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

అయితే వివేకా హత్య కేసులో అధికార పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి సేఫ్‌ అయినట్లుగానే కనిపిస్తోంది.దాంతో తెలుగు దేశం పార్టీ అయ్యో అనుకుంటున్నారట.ఇక ముందు కూడా అవినాష్ రెడ్డి అరెస్టు ఉండక పోవచ్చు అని విచారణలో వెళ్లడైనా విషయాలను బట్టి త్వరలోనే అవినాష్ రెడ్డి యొక్క తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా బెయిల్ పై విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.మొత్తానికి వివేక హత్య కేసును సిబిఐ విచారిస్తుంది కానీ ఈమధ్య కాస్త స్లో అయింది అనిపిస్తుందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube