పాములను మనుషులు హిప్నోటైజ్( Hypnotize ) చేయడం కుదురుతుందని మీకు తెలుసా.కానీ మనుషులను హిప్నోటైజ్ చేయడానికి పాములను( Snakes ) హిప్నోటైజ్ చేయడానికి మధ్య చాలా తేడా ఉంటుంది.
సర్పాలను హిప్నోటైజ్ చేయడం ఈజీ అనుకుంటారు కానీ అది అంత సులభం కాదు.పాములు మనలా ఆలోచించలేవు.
వాటికి మనలా మనసు ఉండదు.మనం పాములను ఒక విధంగా స్టన్ అయ్యేలా చేయవచ్చు.
దీన్ని ‘టానిక్ ఇమోబిలిటీ’( Tonic Immobility ) అని అంటారు.ఇది పాములకున్న ఒక రకమైన రక్షణ పద్ధతి.
మనం పాముల తల వెనుక భాగాన్ని బిగువుగా పట్టుకుంటే లేదా వాటిని వెనక్కి తిప్పి పెడితే, అవి కదలకుండా ఉండిపోతాయి.
![Telugu Snake, Hypnotize, Reptile, Snake Hypnotize-Latest News - Telugu Telugu Snake, Hypnotize, Reptile, Snake Hypnotize-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/10/Reptile-Enthusiast-Hypnotising-And-Playing-With-A-Venomous-Snake-detailsd.jpg)
ఇది మనం మనుషులను హిప్నోటైజ్ చేసినట్లు కాదు.ఇది పాముల శరీరం స్వతహాగా చేసే పని.అంటే, పాములు భయపడి కదలకుండా ఉంటాయి.అయితే ఒక ధైర్యవంతుడు ఇలాంటి ట్రిక్ ఎలా పనిచేస్తుందో చూపిస్తూ ఒక వీడియో రికార్డు చేసి ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.సాధారణంగా చాలామంది పాములను చూస్తే భయపడతారు.
కానీ కొంతమందికి పాములంటే భయం లేదు.వాళ్ళు పాములతో ఆడుకుంటారు కూడా! అలాంటి వ్యక్తి గురించే మనం ఈ ఆర్టికల్లో మాట్లాడుకుంటున్నాము.
![Telugu Snake, Hypnotize, Reptile, Snake Hypnotize-Latest News - Telugu Telugu Snake, Hypnotize, Reptile, Snake Hypnotize-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/10/Reptile-Enthusiast-Hypnotising-And-Playing-With-A-Venomous-Snake-detailss.jpg)
ఆ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది.ఆ వీడియోలో ఒక మనిషి చాలా విషపూరితమైన పాముతో చాలా సులభంగా ఆడుకుంటున్నాడు.ఆ పామును ముద్దు పెడుతున్నాడు, దానిని తలతో తగిలించుకుంటున్నాడు.అంతేకాక, ఆ పాము గొంతు పట్టుకుని చాలా తెలివిగా పట్టుకున్నాడు.ఆ వీడియో చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు.ఆ మనిషి ముందుగా పామును కూల్ చేశాడు.
ఆ తర్వాత ఆ పాము తనతో స్నేహితుడిలా ప్రవర్తించేలా చేశాడు.దీనికి సంబంధించిన ఒక పిక్ కూడా వైరల్ గా మారింది ఇక వీడియో కూడా వివిధ రకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ అవుతోంది.