చాల సార్లు మొగవారి ముందు మహిళలు చాల సులువుగా అవమానాలకు గురవుతూ ఉంటారు.ఉదాహరణకు ఒక సెలబ్రిటీ( Celebrity ) కి భార్య చనిపోతే పెద్దగా పట్టించుకోరు కానీ ఒక లేడీ సెలబ్రిటీ భర్త చనిపోతే లేదా విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటె మాత్రం మీడియా కు అందులో ముఖ్యంగా సోషల్ మీడియాకు పండగే.
త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న ప్రముఖ నటి అంటూ ఎవరికి నచ్చింది, తోచింది వారు రాసేస్తూ ఉంటారు.కనీసం రెండు లేదా మూడు సార్లు పెళ్లి కూడా చేసేస్తూ ఉంటారు.
అంతగా వారి పై చిన్న చూపు ఈ మీడియా కు.

మొన్నటికి మొన్న సురేఖ వాణి( Surekha Vani ) త్వరలోనే ఒక వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంటుంది అంటూ ఏడ పెడా వార్తలు రాసారు.ఇలాంటి నటీమణులంటే అందరికి చిన్న చూపే.ఆమె పెళ్లి చేసుకుంటే డబ్బు కోసం చేసుకుంది అంటారు.
సింగర్ సునీత ( Singer Sunitha )కూడా డబ్బు కోసమే రెండో పెళ్లి చేసుకుంది అని ఎన్నో సార్లు కూసారు కదా.ఇక సురేఖ వాణి పెళ్లి చేసుకోకపోయినా మీడియా కు వార్తే, ఒకవేళ చేసుకుంటే అంత పెద్ద కూతురు ఉండగా మళ్లి పెళ్లి ఏంటి అంటూ రాస్తారు.ఇక ఆమె కారు కొన్నా కూడా సినిమాలు లేవి ఇంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది అంటూ మరొక వార్త కనిపిస్తుంది.అంటే ఆమె సినిమాలు లేకపోతే పేదరికం లో బ్రతకాలా ? ఆమె ఏమి పేద సాధారణ మహిళా కాదు.తన తరపున భర్త తరపున ఎన్నో ఆస్తులు ఉన్నాయ్.మొదటి నుంచి డబ్బుకు లోటు లేని కుటుంబమే.

సినిమాల ద్వారా కూడా బాగానే కూడబెట్టింది.అప్పుడు సంపాదించిన డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేసిన ఈ రోజు హ్యాపీ గా బ్రతకలేదా ? ( happily )ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యి ఆమెను చాల కామెంట్స్ చేస్తూ ఉంటారు.ఇక సురేఖ వాణి ఏదైనా వెకేషన్ వెళ్తే చాలు సోషల్ మీడియా నుంచి సొంత డబ్బు ఎదో ఇచ్చి పంపించిన్నట్టు ఫీల్ అవుతారు.ఆమె కుటుంబాన్ని వీళ్ళే పోషించినట్టు ఎదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు.
కేవలం మహిళలు కాబట్టే ఈ చెత్త అంత వాగుతూ వారికి మనశాంతి లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు.ఇవేమి పట్టించుకోకుండా వెళ్తే సోషల్ మీడియాలో కనిపించడం లేదు అంటే ఎదో అయ్యి ఉంటుంది అంటూ మరొక కామెంట్ పెడాతారు …ఏంటో అస్సలా ఈ పిచ్చి జనాలు .!