చంద్రబాబుని పొగడ్తలతో ముంచేత్తిన సూపర్ స్టార్ రజినీకాంత్..!!

విజయవాడలో ఎన్టీఆర్ ( NTR )శతజయంతి వేడుకలో సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు వర్షం కురిపించారు.తెలుగులో ప్రసంగించిన రజనీకాంత్… తెలుగులో తప్పులు ఉంటే క్షమించాలని కోరారు.

 Superstar Rajinikanth Praised Chandrababu, Superstar Rajinikanth, Chandrababu-TeluguStop.com

ఈ సభను చూస్తుంటే రాజకీయ మాట్లాడాలని అనిపిస్తుంది కానీ రాజకీయం మాట్లాడవద్దని అనుభవం చెబుతుందని తన మనసులో మాట తెలియజేశారు.చంద్రబాబు విజన్ కలిగిన నాయకుడు అని కీర్తించారు.

చంద్రబాబుతో తనకు 30 ఏళ్లుగా స్నేహం ఉందని వెల్లడించారు.

చంద్రబాబు( Chandrababu ) ఘనత దేశ విదేశీ నాయకులకు తెలుసని స్పష్టం చేశారు.

హైదరాబాద్ ను హైటెక్ నగరంగా చంద్రబాబు మార్చారని కొనియాడారు.ఇటీవల చాలా కాలం తర్వాత హైదరాబాద్ సందర్శించడం జరిగింది.ఆ సమయంలో నేను హైదరాబాద్ లో ఉన్నానా లేకపోతే న్యూయార్క్ లో ఉన్నానా అనిపించింది.20 ఏళ్ల కిందటే ఐటీరంగం అభివృద్ధి గురించి దేశంలో చెప్పిన వ్యక్తి చంద్రబాబు.ఆయన ఓడిపోయిన గెలిచిన.నిత్యం ప్రజలకు ఏదో చేయాలని తపిస్తుంటారు.2024 ఎన్నికలలో చంద్రబాబు గెలిస్తే దేశంలో ఏపీ నెంబర్ వన్ అవ్వటం గ్యారెంటీ అని… ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబును దీవిస్తుంది అని రజనీకాంత్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube