పాకిస్తాన్ మనకు దాయాది దేశమే అయినా కూడా మన హీరోల సినిమాలు అక్కడ బాగా నడుస్తాయి.ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకి పాకిస్తాన్ లో మహా క్రేజ్ ఉండేది.
సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్( Salman Khan, Shah Rukh Khan, Aamir Khan ) వంటి హీరోలను బాగా అభిమానించేవారు పాకిస్తానీయులు.వారి సినిమాలు పాకిస్తాన్ లో కూడా విడుదల అయ్యేవి.
అలా శత్రుదేశంలో మన హీరోలకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు.అయితే ఇది ఒకప్పటి మాట.ఎప్పుడైతే ఇండియాలో ఫ్యాన్ ఇండియా కల్చర్ మొదలయ్యిందో అప్పుడే ఆ హద్దులు చెరిగిపోయాయి.మన తెలుగు హీరోలు బాలీవుడ్ ని కిందకి తొక్కేశారు.
ఒకప్పుడు ఖాన్ లకు మాత్రమే ఉన్న క్రేజ్ ఇప్పుడు మన హీరోలకు కూడా బాగానే పెరిగింది.
ముఖ్యంగా పాకిస్తాన్ లో మన తెలుగు హీరోల( Telugu heroes ) హవా పెరిగిన తర్వాత పుష్ప సినిమాకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది.పుష్ప మేనరిజమ్స్ ని చాలామంది పాకిస్తాన్ సినీ ప్రేమికులు ఫాలో అవుతున్నారు.తగ్గేదేలే అంటూ పాకిస్తాన్లో చాలామంది రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.
ఈ రకంగా అల్లు అర్జున్ ( Allu Arjun )హావ బాగా పెరిగింది పాకిస్తాన్లో.అల్లు అర్జున్ తదుపరి సినిమాల కోసం కూడా అక్కడ చాలామంది ఎదురు చూస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్( Ram Charan, Jr.NTR ) కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పాకిస్తాన్ లో పెంచుకోగలిగారు.రాజమౌళి పుణ్యమా అని వీరిద్దరూ ఇప్పుడు ప్రపంచ దేశాలలో పొగడబడుతున్నారు.
వీరు మాత్రమే కాదు ప్రభాస్( Prabhas ) అందరి కన్నా ఒక మెట్టు పైనే ఉన్నాడు.బాహుబలి తర్వాత అతడికి పాకిస్తాన్ లో బాగానే ఫ్యాన్స్ పెరిగారట.ఈ విషయాన్ని చెబుతోంది మరెవరో కాదు పాకిస్తాన్ సినీ విశ్లేషకులే.
అక్కడ అనేక సందర్భాల్లో మన తెలుగు సినిమా హీరోల గురించి మాట్లాడుతున్నారు.పబ్లిక్ ప్రెస్ మీట్స్ లో కూడా ఈ ప్రస్తావన వస్తుంది.
మొదట మన తెలుగు సినిమాలతో ఇండియాలో బాలీవుడ్ వారికి చుక్కలు చూపిస్తున్న హీరోలు ఇప్పుడు పక్క దేశాల్లో కూడా హిందీ హీరోలకు చెక్ పెట్టారు.ఈ రకంగా చూస్తే మరికొన్ని రోజుల్లో తెలుగు సినిమాలు మాత్రమే పాకిస్తాన్ లో చూస్తారో ఏంటో.