T Vishnudatta Jayaraman : అమెరికా : భారతీయ జర్నలిస్ట్‌కు అరుదైన గౌరవం .. వర్జీనియా స్టేట్ సెనేట్‌లో ప్రత్యేక తీర్మానం

అమెరికా( America )లోని వర్జీనియా స్టేట్ సెనేట్ .భారత సంతతి జర్నలిస్ట్ టీ విష్ణుదత్తా జయరామన్‌ను ‘‘dedication to journalism and foreign policy’’లో కృషి చేసినందుకు ప్రశంసిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

 Virginia State Senate Passes Resolution Commending Work Of Indian American Jour-TeluguStop.com

వర్జీనియాలోని 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి యూఎస్ కాంగ్రెస్‌కు డెమొక్రాటిక్ అభ్యర్ధి అయిన ఇండియన్ అమెరికన్ స్టేట్ సెనేటర్ సుహాస్ సుబ్రహ్మణ్యం మార్చి 4న ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.వర్జీనియా స్టేట్ సెనేట్ మార్చి 8న మూజువానీ ఓటుతో ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.

సెనేట్ గ్యాలరీలో జయరామన్‌ను పరిచయం చేసిన సుబ్రహ్మణ్యం.‘‘ సామాజిక మార్పులో కృషి చేసినందుకు జయరామన్‌కు ప్రతిష్టాత్మక అశోక అవార్డు ’’ దక్కిందన్నారు.

అదే సమయంలో జర్నలిజం, విదేశాంగ విధానం పట్ల అతని అంకితభావాన్ని సుబ్రహ్మణ్యం ప్రశంసించారు.

Telugu America, Indianamerican, Journalist, Virginia Senate-Telugu NRI

భారతీయ ప్రవాసులకు మీడియా కవరేజీని అందించినందుకు , భారత్ అమెరికా సంబంధాలను పెంపొందించినందుకు అమెరికాలోని అప్పటి భారత రాయబారి తరంజిత్ సంధూ, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ , సెనేట్ ప్రెసిడెంట్ విన్సమ్ సియర్స్ చేతుల మీదుగా జయరామన్ విశిష్ట సేవా అవార్డును అందుకున్నారు.ఫిబ్రవరి 28న వర్జీనియా హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌కు ఎన్నికైన మొదటి భారతీయ అమెరికన్ వలసదారు కన్నన్ శ్రీనివాసన్ కూడా విశిష్ట సేవా అవార్డును అందుకున్నందుకు హౌస్ ఫ్లోర్‌లో జయరామన్‌కు ప్రశంసా పత్రాన్ని అందించారు.డిసెంబర్ 17, 2023న న్యూఢిల్లీలో అరుణాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ , ఇండియన్ ఆర్మీ 22వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ జేజే సింగ్ , కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సుబోధ్ కాంత్ సహాయ్‌లు.

జయరామన్‌కు అశోక అవార్డును అందజేశారు.ఈ కార్యక్రమాన్ని ది చార్లెస్ వాల్టర్స్ కౌన్సిల్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇండియా నిర్వహించింది.

Telugu America, Indianamerican, Journalist, Virginia Senate-Telugu NRI

తమిళనాడులోని చెన్నైలో జన్మించిన జయరామన్‌ను జేటీ విష్ణు అని కూడా పిలుస్తారు.యూఎస్ వెళ్లడానికి ముందు ఆయన దేశంలోని దిగ్గజ మీడియా సంస్థలైన హిందుస్థాన్ టైమ్స్, ది ట్రిబ్యూనప్, ది సండే అబ్జర్వర్‌లలో పనిచేశారు.న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ విభాగంలోనూ జయరామన్ పనిచేశారు.యూఎన్ ఇయర్ బుక్, యూఎన్ క్రానికల్‌తో సహా పలు ప్రచురణలకు సహకరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube