ధనరాజ్ దగ్గర చిల్లిగవ్వ లేకపోతే బంగారం ఇచ్చేశా.. ధనరాజ్ భార్య షాకింగ్ కామెంట్స్!

తెలుగు బుల్లితెర వెండి తెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ ధనాధన్ ధన్ రాజ్( Comedian Dhanraj ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదటి జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనరాజ్ ఆ తర్వాత అదే ఊపుతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాలలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

 Comedian Dhanraj Wife Sirisha About Personal Life And Divorce Details, Comedian-TeluguStop.com

ఆ తర్వాత వెండితెర పై కూడా కమెడియన్ గా బాగా నవ్వులు పూయించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ సంగతి పక్కన పెడితే ధనరాజ్‌ ప్రయాణంలో తన వెన్నంటే నిలిచిన ఆయన భార్య శిరీష( Sirisha ) మొదటిసారి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా శిరీష ఎన్నో ఆసక్తికర విషయం వెల్లడించారు.

Telugu Dhanraj, Dhanraj Divorce, Dhanraj Sirisha, Sirisha, Tollywood-Movie

ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ.ధనరాజ్‌ది విజయవాడ.నాది ఖమ్మం.

నేను క్లాసికల్‌ డ్యాన్సర్‌ ను.ధనరాజ్‌ ఫిలిం నగర్‌ లో ఒక డ్యాన్స్‌ స్టూడియో పెట్టినప్పుడు టీచర్‌ కోసం వెతుకుతున్నారు.అలా నన్ను కలిశాడు.అదృష్టమో, దురదృష్టమో తెలీదు కానీ నేను పరిచయమైన రోజే అతడి అమ్మ క్యాన్సర్‌ తో చనిపోయింది.ఆమె వెళ్లిపోతూ నన్ను అతడికి ఇచ్చిందని ధనరాజ్‌ ఫీలయ్యాడు.తల్లి అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బు లేకపోతే నా దగ్గరున్న బంగారం ఇచ్చేశాను.

నవంబర్‌ లో ఆమె చనిపోతే మార్చిలో మా పెళ్లి జరిగింది.మాది ప్రేమ వివాహం.

Telugu Dhanraj, Dhanraj Divorce, Dhanraj Sirisha, Sirisha, Tollywood-Movie

అది కూడా నేనే ప్లాన్‌ చేశాను.రేపు మన పెళ్లి అనగానే సరేనని తలూపాడు.ఇంట్లో వాళ్లను కాదని 15 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాను.మా పెళ్లయిన మూడో రోజే జగడం సినిమా రిలీజ్ అయ్యింది.అక్కడి నుంచి ధనరాజ్‌ కు అవకాశాలు, ఫేమ్‌ మొదలైంది.అయితే ఆయన నిర్మాతగా ధనలక్ష్మి తలుపు తడితే అని ఒక సినిమా తీశాడు.

అది నాకు ఇష్టం లేదు.ఆయన మాత్రం కచ్చితంగా ఆడుతుందని నమ్మి తీశాడు.

ఒకవేళ సినిమా పోతే జీరో నుంచి మొదలు పెట్టాల్సిందే.నేను అనుకున్నట్లుగానే జీరో నుంచి మళ్లీ స్టార్ట్‌ చేశాం.

సోషల్‌ మీడియాలో మా గురించి ఏవేవో పుకార్లు రాస్తుంటారు.ఆ మధ్య మేము రోడ్డున పడ్డామని రాశారు.

ఇల్లు కూడా అమ్మేశామని ప్రచారం చేశారు.ఇప్పుడేమో విడాకులు( Divorce ) తీసుకుంటున్నట్లు పుకార్లు! మా మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతుంటాయి.

వారం పది రోజులపాటు మాట్లాడుకోము.అంతేకానీ విడాకులు తీసుకునేంత సీన్‌ ఏం లేదు.

మేము సంతోషంగా ఉన్నాము.ఏవి పడితే అవి రాయవద్దు.

ఇకపోతే ధనరాజ్‌ ఫ్రెండ్స్‌ మా ఇంటికి వస్తూ ఉంటారు.సుడిగాలి సుధీర్‌ నాకు ఎక్కువ క్లోజ్‌.

ప్రస్తుతానికైతే వాడు పెళ్లే చేసుకోను అంటున్నాడు అని తెలిపింది శిరీష.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube