భార్యా పిల్లలపై గొడ్డలితో దాడి.. అసలేం జరిగిందంటే..?

ఓ 55 ఏళ్ల వ్యక్తి తన భార్య పిల్లలను గొడ్డలితో నరికిన ఘటన ఢిల్లీలోని నెబ్ సరాయ్ ( Neb Sarai )ప్రాంతంలో గురువారం తీవ్ర కలకలం రేపింది.స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుని అదుపులోకి తీసుకున్నారు.

 Attack On Wife And Children With Ax What Actually Happened , Neb Sarai, Vijay V-TeluguStop.com

వివరాల్లోకెళితే.విజయ్ వీర్( Vijay Veer ) అనే ప్రాపర్టీ డీలర్ తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలను చంపడానికి ప్రయత్నించాడు.

అయితే వరకట్నం విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.ఈ క్రమంలోనే గురువారం నిద్రలో ఉండే భార్యపై గొడ్డలితో దాడి చేశాడు.

ఇందులో మరో కోణం ఏమిటంటే విజయ్ వీర్ కు వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయని పోలీసుల విచారణలో బయటపడింది.భార్య భర్తల గొడవల విషయంలో కొడుకు, కూతురు కూడా భార్యకే సపోర్ట్ చేయడంతో జీర్ణించుకోలేకపోయినా విజయ్ గురువారం ఉదయం 6:30 గంటల సమయంలో భార్యా, పిల్లలపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోపే విజయ్ భార్య రక్తపు మడుగులోకి జారుకుంది, ఇక విజయ్ కొడుకు, కూతురి మెడపై, నుదుటి భాగాలపై గాయాలైనట్లు గుర్తించారు.తమ తండ్రి తమపై, తమ తల్లిపై దాడి చేశారని పోలీసులకు తెలిపారు.అందరినీ వైద్యం కోసం ఆస్పత్రికి తరలించగా విజయ్ వీర్ భార్య సుమన్ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.ఉత్తర ప్రదేశ్( Uttar Pradesh ) లోని ఘర్ ముక్తేశ్వర్ కు చెందిన విజయవీర్, సుమన్ అనే మహిళను 1992లో వివాహం చేసుకున్నాడు.

వివాహం తర్వాత నెబ్ సరాయ్ లోని విజయ్ బంధువుల ఇంట్లో కాపురం పెట్టారు.పూర్తిస్థాయిలో విచారణ జరిపిన పోలీసులకు 2017 లో కూడా ఒకసారి విజయ్ వీర్ అరెస్టు అయినట్లు తేలింది.

ఆ సమయంలో భార్యతో గొడవ కారణంగా కుటుంబ సభ్యులందరిపై కాల్పులు జరిపి, కుమారుడు శంశాక్ ను గాయపరచాడు.ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి పోలీసులు జైలుకు పంపించారు.

ప్రస్తుతం హత్యాయత్నం అభియోగాల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube