రాజస్థాన్ రాయల్స్,( RR ) కలకత్తా నైట్ రైడర్స్( KKR ) జట్ల మధ్య గువాహటి వేదికగా మ్యాచ్ జరిగిన సంగతి అందరికీ తెలిసిన సంగతే.అయితే సదరు మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకోవడంతో ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సెక్యూరిటీ కళ్లుగప్పి మరీ ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు.దూసుకు రావడంతోనే నేరుగా అతను గ్రౌండ్ లోకి వెళ్లి తన అభిమాన క్రికెటర్ రియాన్ పరాగ్( Riyan Parag ) కాళ్లు మొక్కడం జరిగింది.
కట్ చేస్తే… ఊహించని సదరు ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని స్టేడియం బయటకు లాక్కెళ్లడం జరిగింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తుండడం గమనార్హం.దీనిని పరాగ్ చేసిన PR స్టంట్ అని అభిమానులు అభివర్ణించారు.
ఇకపోతే సంజు శాంసన్( Sanju Samson ) వేలికి గాయం కావడంతో ఐపీఎల్ 2025 సీజన్‌లోని మొదటి 3 ఆటలకు రియాన్ పరాగ్‌ను రాజస్థాన్ రాయల్స్ స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఐపీఎల్ కెప్టెన్‌గా తన అరంగేట్రంలో సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ 44 పరుగుల తేడాతో దారుణమైన ఓటమిని అందుకుంది.
ఇక తాజా ఘటనతో రియాన్ పరాగ్ కు కూడా రోహిత్ శర్మ కంటే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారా? జనాలు నోళ్లెళ్లబెడుతున్నారు.అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, మీడియా అటెన్షన్ కోసమే పరాగ్ రూ.10 వేలు ఇచ్చి మరీ ఇలాంటి PR స్టంట్ కు ప్లాన్ చేసి ఉంటాడని గుసగుసలు వినబడుతున్నాయి.రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్151 పరుగులు సాధించింది.డికాక్ (97*) రఘువనీ (22*)తో కలిసి ఆడుతూ పాడుతూ కేకేఆర్ ను విజయం పాట పట్టేలా చేసాడు.
ఈ సీజన్ తో కేకేఆర్ కు ఇది తొలి విజయం కాగా రాజస్థాన్ జట్టుకు వరుసగా ఇది రెండో ఓటమి కావడం కొసమెరుపు.