ప్రకటనలలో కూడా తనకు సాటి లేరు అని నిరూపించిన కే విశ్వనాథ్ గారు

కళాతపస్వి విశ్వనాథ్ గారు సినీ లోకం నుంచి విరమించుకోవడం కాదు ఈ ప్రపంచంలో ఆయన విరమణ తీసుకొని వెళ్ళిపోయారు.ఆయన దర్శక దిగ్గజంగా ఎన్నో మంచి ఆణిముత్యాలను తెలుగు సినిమా అభిమానులకు అందించారు.

 Vishwanath Garu Into Commercial Ads ,ram Raj Cotton , As Raonagar, Vishwanath Ga-TeluguStop.com

ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాను అందరూ గుర్తుపెట్టుకునేలా శంకరాభరణం వంటి అద్భుతమైన సినిమా తీశారు కె విశ్వనాథ్.అయితే కేవలం దర్శకత్వం తోనే కాకుండా నటుడుగా కూడా మారి ఎన్నో మంచి అద్భుతమైన సినిమాల్లో నటించారు.

టాలీవుడ్ లో మరే దర్శకుడికి కూడా సాధ్యం కాని విధంగా ఎన్నో కమర్షియల్ ప్రకటనలలో కూడా కనిపించడం విశ్వనాథ్ గారికి మాత్రమే చెల్లింది.

Telugu Raonagar, Grt Jewellers, Vishwanath, Ram Raj Cotton, Sri Ramaraksha, Suva

అంత పెద్ద దర్శకుడు ఉండి కూడా ప్రకటనలో నటించడం ఆయనకు ఆర్థిక అవసరమా లేదా అదనపు ఆదాయం అనే విషయం స్పష్టంగా తెలియకపోయినా ఆయన సువర్ణభూమి డెవలపర్స్ వారికి బాలసుబ్రమణ్యం గారితో కలిసి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు.వీరిద్దరూ కలిసి చేసిన ప్రకటన తర్వాత ఆ వెంచర్ యొక్క పేరు అలాగే అమ్మకాలు అద్భుతంగా పెరిగిపోయాయి.ఇక సువర్ణభూమి వెంచర్ వారి మరొక వెంచర్ అయినటువంటి శ్రీరామరక్ష కోసం కూడా విశ్వనాధ్ గారు తల వంతు సహాయం చేసి బిజినెస్ బాగా జరిగేలా సహకరించారు.

ఈ శ్రీరామరక్ష ప్లాట్ల అమ్మకం కోసం 2016లో కే విశ్వనాథ్ గారు రెండుసార్లు రాజనగరం వెళ్లి అక్కడ ఉన్న సైట్లలో మార్నింగ్ వాక్ చేసి మరి ప్రచారం కల్పించడం అప్పట్లో పెద్ద సంచలనమే అయింది.

Telugu Raonagar, Grt Jewellers, Vishwanath, Ram Raj Cotton, Sri Ramaraksha, Suva

విశ్వనాథ్ గారు బ్రాహ్మణుడు కనుక ఎంతో మంది బ్రాహ్మణులు సువర్ణ భూమిలో ఫ్లాట్లు కొన్నారని అప్పట్లో బాగా వినిపించింది.కేవలం రియల్ ఎస్టేట్ కంపెనీస్ మాత్రమే కాకుండా జిఆర్టి జువెలర్స్ కూడా ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు ఆ కంపెనీ అమ్మకాలు పెంచడంలో ఎంతో దోహదపడ్డారు 85 ఏళ్ల వయసులో ఆయన అలాంటి ఒక వాని చెప్పు ప్రకటనకు కనిపించడం నిజంగా తెలుగు సినిమా చరిత్రలోనే ఒక అద్భుత ఘట్టం అని చెప్పాలి.ఇక హైదరాబాదులోనే ఏఎస్ రావునగర్ లో రామ్ రాజ్ కాటన్ షాప్ ప్రారంభోత్సవానికి 86 ఏళ్ల వయసులో శుభోదయం అనుకోకుండా ఓపెనింగ్ చేసి వెళ్లారు కే విశ్వనాథ్ గారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube