గర్భధారణ సమయంలో.. చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే..!

గర్భ ధారణ సమయంలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి.మరీ ముఖ్యంగా తల్లులు చాలా ఆరోగ్యంగా ఉండాలి.

 These Are The Things To Do And Not To Do During Pregnancy , During Pregnancy, He-TeluguStop.com

తల్లులు ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.అయితే ఏప్రిల్ 11వ తేదీన నేషనల్ సేఫ్ ప్రెగ్నెన్సీ డే( National Safe Pregnancy Day ) ను జరుపుకుంటారు.

గర్భ ధారణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు ముఖ్య ఉద్దేశంగా చెబుతారు.అలాగే ప్రసూతి, ఆరోగ్యం సురక్షితమైన ప్రసవం ప్రాముఖ్యతను ఈరోజు నొప్పి చెబుతుంది.

అయితే ఈరోజు సందర్భంగా గర్భ ధారణ సమయంలో చేయవలసిన చేయకూడని కొన్ని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు రాత్రి కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

రాత్రి సమయంలో నిద్రపోవాలంటే కెఫిన్( Caffeine ) తీసుకోకూడదు.ఎందుకంటే కెఫిన్ నిద్ర దెబ్బ తీస్తుంది.ఇక గర్భధారణ సమయంలో చురుకగా ఉంటే తల్లి, బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారు.అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే హృదయమాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Telugu Caffeine, Diabetes, Tips, Pre Eclampsia-Telugu Health

అదేవిధంగా కండరాల బలం కూడా పెరుగుతుంది.అంతేకాకుండా ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.వ్యాయామం చేయడం వలన మధుమేహం, ప్రీ ఎంక్లాంప్సియా ( Diabetes, pre-eclampsia ) ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.ఇక గర్భిణీ స్త్రీలు నిత్యం నీరును తాగడం చాలా అవసరంలో ఉంటుంది.

అదేవిధంగా నీళ్లు ఆరోగ్యకరమైన రక్తపోటుని నిర్వహిస్తుంది.అలాగే మలబద్ధకాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

అంతేకాకుండా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను, ముందస్తు ప్రసవ ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుంది.

Telugu Caffeine, Diabetes, Tips, Pre Eclampsia-Telugu Health

ఇక సమతుల్య ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు, పాల ఉత్పత్తులు కచ్చితంగా ఉండాలి.అంతేకాకుండా గర్భధారణ సమయంలో పెరుగుతున్న పిండం ఆరోగ్యంగా ఉండడానికి రోజువారి క్యాలరీలు తీసుకోవాలి.అంతేకాకుండా గర్భధారణ సమయంలో సిగరెట్ పోగలకు, రసాయనాలకు దూరంగా ఉండాలి.

ఇవి పిండానికి హాని కలిగిస్తాయి.

Telugu Caffeine, Diabetes, Tips, Pre Eclampsia-Telugu Health

అలాగే అకాల జననం, తక్కువ బరువు, ప్రసవం, ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్ లాంటి అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని ఈ ధూమపానం పెంచుతుంది.అందుకే గర్భ ధారణ సమయంలో చేస్తే రక్తస్రావం, ప్రసవ సమయం కష్టంగా ఉంటుంది.అంతేకాకుండా మద్యం కూడా పిండానికి హాని కలిగిస్తుంది.

అందుకే ధూమపానం, మధ్యపానం లాంటి వాటికి దూరంగా ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube