ముంబై ( Mumbai )మహా నగరంలో ఎన్నో భాషలు మాట్లాడే జనం ఉన్నారు కానీ అందరినీ కలిపేది మాత్రం ఒక్కటే, అదే ఫుడ్.అలాంటి ఫుడ్ కనెక్షన్‌కి కేరాఫ్ అడ్రస్ “కేఫ్ మద్రాస్”( Cafe Madras ).
ముంబైలోని మటుంగాలో ఈ కేఫ్ ఉంది.ఈ ప్రాంతాన్ని “లిటిల్ మద్రాస్” ( Little Madras )అని కూడా పిలుస్తారు.కేఫ్ మద్రాస్ అంటే జస్ట్ తినడానికి ప్లేస్ మాత్రమే కాదు, ఇది ఒక ట్రెడిషన్, అద్భుతమైన రుచి, అందరినీ కలిపే ఒక వేదిక.1940 నుంచి కామత్ ఫ్యామిలీ ఈ హోటల్‌ని రన్ చేస్తోంది.స్టూడెంట్స్, సీనియర్ సిటిజన్స్, ఆఫీస్ వర్కర్స్, సినిమా స్టార్స్, ఇలా ఎంతోమంది ఇక్కడ కడుపు నింపుకున్నారు.
రీసెంట్‌గా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ( Big B Amitabh Bachchan, Abhishek Bachchan )ఇద్దరూ కలిసి ఈ కేఫ్‌కి వెళ్లడంతో ఇది మరింత ఫేమస్ అయిపోయింది.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 మ్యాచ్ చూసి మరీ వాంకడే స్టేడియం నుంచి డైరెక్ట్‌గా ఇక్కడికే వచ్చారు.వాళ్లని చూడటానికి ఫ్యాన్స్ గుంపులు గుంపులుగా వచ్చేశారు.కానీ కేఫ్ మద్రాస్‌లో మాత్రం అందరూ ఒక్కటే.మీరు సూపర్ స్టార్ అయినా, స్టూడెంట్ అయినా దోశ కోసం వెయిట్ చేయాల్సిందే.

ఇక్కడి అసలు మ్యాజిక్ ఫుడ్లోనే ఉంది.సాఫ్ట్ సాఫ్ట్ ఇడ్లీలు, క్రిస్పీ రాగి మసాలా దోసలు, స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ.అబ్బో ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది.సింపుల్ బెంచీలు, చిన్న టేబుల్స్ ఉంటాయి కానీ అదే ఇక్కడి స్పెషల్ అట్రాక్షన్.వేడి వేడి సాంబార్ వాసన, నవ్వులు, కబుర్లతో ఆ ప్లేస్ హోమ్లీగా అనిపిస్తుంది.