మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో శంకర్ దాదా ఎంబీబీఎస్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే.జయంత్ సి పరాన్జీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఇ సినిమా చిరంజీవి అభిమానులకు ఎంతగానో నచ్చింది.
అయితే ఈ సినిమా వల్ల తన వ్యాధి బయటపడిందంటూ వైష్ణవి వర్మ( Vaishnavi Varma ) అనే అమ్మాయి సోషల్ మీడియాలో రీల్ పెట్టగా ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.
శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూసిన తర్వాత నాకు టైప్1 డయాబెటిస్ ( Type 1 diabetes )ఉందని తెలిసిందని ఆమె చెప్పుకొచ్చారు.
నేను సరదాగా అనడం లేదని నేను నిజమే చెబుతున్నానని ఆమె కామెంట్లు చేశారు.నాకెప్పుడూ దాహం వేస్తుండేదని ఆకలిగా ఉండేదని వైష్ణవి వర్మ పేర్కొన్నారు.ఎక్కువసార్లు టాయిలెట్ కు వెళ్లేదానినని ఉన్నపళంగా బరువు తగ్గేదానినని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.

ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లినా ఎవరూ ఏం చెప్పలేకపోయారని ఒకరోజు నేను శంకర్ దాదా ఎంబీబీఎస్ ( shankar dada mbbs movie )సినిమా చూస్తున్న సమయంలో చిరంజీవి చెబుతున్న ఒక వ్యాధి లక్షణాలన్నీ నాకు సరిపోయాయని సినిమా మధ్యలో ఆపేసి నాకు డయాబెటిస్ ఉందని పేరెంట్స్ కు చెప్పానని వైష్ణవి వర్మ కామెంట్లు చేశారు.వాళ్లు గట్టిగా నవ్వి నెగిటివ్ గా ఆలోచించకు అని చెప్పారని ఆమె చెప్పుకొచ్చారు.

ఎందుకైనా మంచిదని పరీక్ష చేయించుకుంటే రక్తంలో చక్కెర డెసిలీటర్ కు 555 మిల్లీగ్రాములు ఉందని అల నాకు వ్యాధి నిర్ధారణ అయ్యాక నేను చికిత్స తీసుకున్నానని వైష్ణవి వర్మ అన్నారు.నిజానికి మాకు మెడికల్ బ్యాగ్రౌండ్ ఉందని కానీ ఎవరం గెస్ చేయకపోయామని ఆమె చెప్పుకొచ్చారు.శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ నా జీవితాన్ని మార్చేసిందని వైష్ణవి వర్మ తెలిపారు.
వైష్ణవి వర్మ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.







