ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ( Florida State University ) (FSU) క్యాంపస్‌లో గురువారం జరిగిన కాల్పులు పెను విషాదాన్ని నింపాయి.టల్లాహస్సీలోని ఈ యూనివర్సిటీలో ఒక్కసారిగా తుపాకీ మోతలు మిన్నంటడంతో విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, కనీసం ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.భయానక వాతావరణం, ఏం జరుగుతుందో తెలియని అయోమయం.
కానీ, ఆ సమయంలో కొందరు విద్యార్థులు చూపిన తెలివితేటలు, ధైర్యం మాత్రం నిజంగా అమోఘం.ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కూడా చావును జయించిన ఆ విద్యార్థులకు సెల్యూట్ చేయాల్సిందే.
జేఫ్రీ లాఫ్రే( Jeffrey Laffrey ) అనే విద్యార్థి స్టూడెంట్ యూనియన్ దగ్గరలోని క్లాస్‌రూమ్‌లో ఉన్నాడు.కాల్పులు మొదలైనప్పుడు ఏం జరిగిందో స్వయంగా ఆయనే ABC న్యూస్ ఛానెల్‌కిచ్చిన ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ ( Good Morning America )కార్యక్రమంలో వివరించాడు.
లాఫ్రే ప్రకారం, క్లాస్‌రూమ్ కిటికీల నుంచి షూటర్ లోపలికి కనిపించకుండా ఉండాలని వాళ్ల టీచర్ అనుకున్నారు.కానీ అసలు సమస్య అప్పుడే మొదలైంది.కిటికీలకు పేపర్ అంటించడానికి టేప్ లేదు.
వెంటనే విద్యార్థుల బుర్రల్లో మెరుపులాంటి ఆలోచన వచ్చింది, చుయింగమ్ నమలడం మొదలుపెట్టారు.
నమిలిన చుయింగమ్‌ను( Chewing gum ) పేపర్‌కు అంటించి కిటికీలకు అడ్డుగా వేశారు.తమ ప్రాణాలను కాపాడుకోవడానికి వాళ్ళు చేసిన పనికి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.“టీచర్ టేప్ ఎవరి దగ్గరైనా ఉందా అని అడిగారు.ఎవరి దగ్గరా లేదు.
అందుకే మేం కొందరు చుయింగమ్ నమిలి, పేపర్ అంటించేంత జిగురు వచ్చేలా చేశాం,” అని లాఫ్రే చెప్పాడు.నిజంగానే, ప్రాణాలు కాపాడుకోవడానికి విద్యార్థులు వేసిన ఎత్తు అమోఘం.
మాడిసన్ ఆస్కిన్స్ అనే మరో విద్యార్థిని ప్రాణాలతో బయటపడటానికి మరో తెలివైన ప్లాన్ వేసింది.ఆమె తన స్నేహితురాలితో కలిసి స్టూడెంట్ యూనియన్ దగ్గర నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి షూటర్ కాల్పులు జరిపాడు.
తూటా నేరుగా ఆమె పిరుదులకు తగిలింది.దాంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అక్కడికక్కడే చనిపోయినట్లు నటించింది.

“నేను కళ్లు మూసుకున్నాను, శరీరాన్ని వదిలేశాను, షూటర్ నేను చనిపోయానని అనుకునేలా చిన్నగా ఊపిరి పీల్చుకున్నాను,” అని ఆమె చెప్పింది.షూటర్ మళ్లీ గన్ రీలోడ్ చేయడం, మిగతావాళ్లని “పరిగెత్తండి” అని అరవడం కూడా ఆమె విన్నదట.20 ఏళ్ల ఫోనిక్స్ ఇక్నర్ అనే యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.షాకింగ్ విషయం ఏంటంటే, ఇతను స్థానిక షరీఫ్ డిప్యూటీ కుమారుడు.
తల్లి తుపాకీనే దొంగిలించి కాల్పులకు ఉపయోగించాడని తెలుస్తోంది.పోలీసులు లొంగిపోవాలని చెప్పినా వినకపోవడంతో అతన్ని కాల్చి గాయపరిచారు.
ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు.

ఉదయం 11:20 గంటల ప్రాంతంలో స్టూడెంట్ యూనియన్ దగ్గర కాల్పులు మొదలయ్యాయి.విద్యార్థులు భయంతో పరుగులు తీశారు.కొందరు బౌలింగ్ అల్లేలో దాక్కున్నారు, మరికొందరు లిఫ్టుల్లో దూరిపోయారు.
యూనివర్సిటీ మొత్తం మధ్యాహ్నం 3 గంటల వరకు లాక్‌డౌన్ విధించారు.పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
క్రైమ్ సీన్ టేప్‌తో సీల్ చేశారు.ప్రజలు ఎవరూ అటువైపు వెళ్లొద్దని పోలీసులు హెచ్చరించారు.







