అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఒత్తైన జుట్టును కోరుకుంటాడు.కానీ సరైన కేర్ తీసుకోకపోవడం, పోషకాలు కొరత, ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలు, కాలుష్యం, ఒత్తిడి తదితర కారణాల వల్ల చాలా మంది పురుషులకు జుట్టు పల్చబడి పోతుంటుంది.
దాంతో మరింత ఒత్తిడికి లోనవుతుంటారు.కానీ టెన్షన్ అక్కర్లేదు.
జుట్టును( hair ) ఒత్తుగా మార్చే ఒక సూపర్ ఆయిల్ ఉంది.మరి ఆ ఆయిల్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ), వన్ టేబుల్ స్పూన్ లవంగాలు( cloves ) వేసుకొని కొంచెం బరకగా పొడి చేసుకోవాలి.ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు డ్రై రోజ్ మేరీ ఆకులను( Dry Rose Mary leaves ) కూడా పొడి చేసుకుని పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో అవిసె గింజలు, లవంగాలు మరియు రోజ్ మేరీ ఆకుల పొడిని వేసుకోవాలి.అలాగే ఒక కప్పు ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో ఉంచి దాదాపు పది నిమిషాల పాటు డబుల్ బాయిలర్ మెథడ్ లో ఉడికించాలి.ఆపై క్లాత్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.

హెయిర్ గ్రోత్( Hair Growth ) ను ఇంప్రూవ్ చేయడంలో ఈ ఆయిల్ చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను స్కాల్ప్ కి అప్లై చేసుకుని కనీసం ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.మరసటి రోజు తేలికపాటి షాంపూను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.లేదా ఆయిల్ అప్లై చేసుకున్న నాలుగు గంటల తర్వాత కూడా తల స్నానం చేయవచ్చు.

వారానికి రెండు లేదా మూడుసార్లు ఈ మ్యాజికల్ ఆయిల్ ను కనుక వాడారంటే వద్దన్నా మీ జుట్టు దట్టంగా పెరుగుతుంది.జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది.ఊడిన జుట్టును మళ్ళీ మొలిపిస్తుంది.హెల్తీ అండ్ థిక్ హెయిర్ ను మీ సొంతం చేస్తుంది.కాబట్టి జుట్టును ఒత్తుగా మార్చుకోవాలని ఆరాటపడుతున్న అబ్బాయిలు కచ్చితంగా ఈ ఆయిల్ ను తయారు చేసుకొని వాడేందుకు ప్రయత్నించండి.