బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోకు( Bigg Boss ) ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ పెరుగుతోందనే సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షో సీజన్1 కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా బిగ్ బాస్2 కు నాని హోస్ట్ గా వ్యవహరించారు.
బిగ్ బాస్ సీజన్3 నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ వచ్చారు.అయితే బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్యను( Balayya ) సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
బిగ్ బాస్ షో రేటింగ్స్ తగ్గడమే ఇందుకు కారణమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.మరోవైపు బిగ్ బాస్ షో నియమ నిబంధనల వల్ల ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలు ఈ షోకు హాజరు కావడం లేదు.
బిగ్ బాస్ షో హోస్ట్ గా బాలయ్య జాయిన్ అయితే మాత్రం ఈ షో రేటింగ్స్ పుంజుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదు.

అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య బిగ్ బాస్ షోకు హోస్ట్ గా ఓకే చెబుతారా లేదా అనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరక్కాల్సి ఉంది.అన్ స్టాపబుల్ షోను( Unstoppable ) హిట్ చేసిన బాలయ్య బిగ్ బాస్ షోను హిట్ చేస్తారేమో చూడాల్సి ఉంది.అన్ స్టాపబుల్ షో కోసం వర్క్ చేసిన టీం ఈ షో కోసం పని చేయనుందని తెలుస్తోంది.
బాలయ్య రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది.

ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన షోకు బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తారా అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.బాలయ్య ఈ ఏడాది ఆగష్టు నాటికి అఖండ2( Akhanda 2 ) మూవీ షూటింగ్ ను పూర్తి చేయనున్నారని తెలుస్తోంది.బాలయ్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లకు ఓకే చెబుతూ ప్రశంసలు అందుకుంటున్నారు.