Alcohol : మీలో ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం.. మద్యపానం అస్సలు చేయకూడదు.. లేదంటే ప్రమాదమే..!

ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలు మద్యానికి బానిసలుగా మారిపోతున్నారు.కొందరు రోజుకు కొద్ది మొత్తంలో తీసుకుంటే, మరికొందరు మాత్రం చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు.

 Avoid Drinking Alcohol If You Have These Symptoms-TeluguStop.com

మద్యపానం( Alochol ) ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికీ మద్యానికి దూరం కాలేక బానిసలుగా మారిపోతున్నారు.అలాగే చాలా అధ్యయనాలలో కూడా మద్యం వల్ల చాలా ప్రమాదకర సమస్యలు వస్తాయని వెళ్లడైంది.

అయినప్పటికీ కూడా చాలామందికి భయం అనేది లేదు.నీళ్లు తాగినట్లు మద్యం తాగుతూ ఉన్నారు.

Telugu Alcohol, Cancer, Problems, Tips, Immunity-Telugu Health Tips

అయితే మద్యం అలవాటు ఉన్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా మానేయాలని, లేదంటే ప్రమాదంలో పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే తెల్లవారుజామున నిద్ర లేచాక నీరసంగా ఉంటే మద్యానికి దూరంగా ఉండడమే మంచిది.అలాగే మద్యం వల్ల రోగనిరోధక శక్తి( Immunity Power ) దెబ్బతింటుంది.

దీంతో చిన్న చిన్న వాటికి అనారోగ్యానికి గురవుతారు.పలు ప్రమాదకరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కాబట్టి ఇలాంటివారు మద్యం అసలు సేవించకూడదు.

Telugu Alcohol, Cancer, Problems, Tips, Immunity-Telugu Health Tips

ఇంకా చెప్పాలంటే దగ్గు, కడుపులో ఉబ్బరంగా ఉంటే మద్యం వల్లే అని గుర్తించాలి.ముఖ్యంగా చెప్పాలంటే దురద( Itching ), దద్దుర్లు వచ్చినట్లయితే మద్యాన్ని పూర్తిగా మానుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.అంతేకాకుండా దంతాలు, చిగుళ్ల సమస్యలు ఏర్పడితే అది మద్యం వల్లే అని వైద్యులు చెబుతున్నారు.

కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.అలాగే వారు చెప్పిన సూచనలను క్రమం తప్పకుండా పాటించడం మంచిది.

ఇక మరీ ముఖ్యంగా మద్యం సేవించడం వలన క్యాన్సర్( Cancer ), మూత్రపిండ సమస్యలు, కాలేయం దెబ్బ తినడం లాంటి ప్రమాదకరమైన జబ్బులు వస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube