కనకదుర్గమ్మ, మహిషాసుర మర్దిని, దుర్గాదేవి, ఆదిపరాశక్తి ఎలా పిలిచినా పలికే అమ్మవార్లు భక్తుల కోరికలు తీర్చే ఇలవేల్పుగా పూజలు అందుకుంటూ ఉన్నారు.నవరాత్రుల వేడుకల్లో రోజు అవతారంగా మారి భక్తుల కొంగుబంగారంగా వెలుగుతున్నారు.
అమ్మ వారు అంటే ఉగ్రరూపాలే గుర్తుకొస్తాయి.పెద్ద నాలుక, అస్త్రశస్త్రాలు మెడలో పుర్రెల దండ, నిమ్మకాయల దండతో ఉగ్రరూపంగా కనిపించిన ఆ రూపం వెనుక వెన్నలాంటి అమ్మ మనస్సుతో ఎప్పుడూ కరుణ కురిపిస్తూనే ఉంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే రాక్షసుల అపరకాళిలా గా భక్తులకు అమ్మలా కనిపించే అమ్మవారు ధరించే నిమ్మకాయలహారం వెనుక ఉన్నా రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.రాక్షస సంహారం చేసిన అమ్మ వారిని శాంతింప చేయడానికి భక్తులు అయిగిరి నందిని నందిత మోదిని అయిగిరి అంటూ పాటలు పడి శాంతింప చేస్తూ ఉంటారు.అలాగే అమ్మ వారిని శాంత పరిచి ప్రసన్నం చేసుకోవడానికి ఆమెకు ప్రీతిపాత్రమైన పుల తో కూడిన నిమ్మకాయల దండను తల్లికి వేయడం సంప్రదాయంగా వస్తూ ఉందని పండితులు చెబుతున్నారు.

కళావతీ కళారూపా కాంతా కాదంబరీ ప్రియా అంటుంది లలిత సహస్ర నామం.అందుకే ఆమెకు కాదంబరి వంటి పుల్లని రుచితో ఉండే నిమ్మకాయలను దండగ వేయడం, పులిహోర వంటి పుల్లటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ఆచారంగా వస్తూ ఉంది.ఈ కార్యక్రమం లో నిమ్మకాయలను దుష్టశక్తుల పీడా నివారణకు బలిగా ఉపయోగించడం ప్రారంభమైంది.
అమ్మవారి మెడలో నిమ్మకాయల దండను వేయడం వెనుక కారణం ఇదేనని పండితులు చెబుతున్నారు.అలాగే అమ్మవార్లకు పులిసిన పెరుగు అన్నం కూడా నైవేద్యంగా పెడతారు.గ్రామదేవతలకు నైవేద్యం చలి నైవేద్యం పెడతారు.అలా అమ్మవార్లకు పులుపుతో ప్రసన్నం చేసుకోవడం ఆచారంగా మారింది.
అందుకే అమ్మ వార్లకు నిమ్మకాయల్ని దండగ వేస్తారు.కానీ సత్వ రూపిణులైన లక్ష్మీదేవికి కానీ సరస్వతి అమ్మవార్లకు మాత్రం ఇది వర్తించదని పండితులు చెబుతున్నారు.