బ్రహ్మవిద్యను బోధించేవి ఉపనిషత్తులు అంటారు.ధర్మం లేదా రహస్యం కూడా ఉపనిషత్తు అని పిలుస్తారు.
అయితే ‘సర్వే అర్థాః ఉప నిషేధంతి అస్యామితి ఉప నిషత్’ అన్న నిర్వచనం బట్టి అన్ని అర్ధాలూ దేనిలో ఉంటాయో అది ఉపనిషత్తు అన్న వివరణ ఉంది.సంసార బీజాన్ని నశింపజేసేది, మోక్షం కోరే వారిని పర బ్రహ్మం వద్దకు చేర్చేది, బాధ పట్టే సంసార సమస్యలను తొలగించేది ఉపనిషత్తు అని భాష్యకర్తలు తెలియజెప్పారు.
గురువు సన్నిధిలో ఏకాంతంలో కూర్చొని శిష్యులు ఆయన నుండి గ్రహించే తత్త్వమే ఉపనిషత్తు అని అంటారు అందులో మేలైన శ్రేయస్సు ఉపనిషణ్ణమై ప్రతిపాదించే గ్రంథాలను గూడా ఉపనిషత్తుల బ్రహ వ్యవహారం దానిని జీవుడు, దేవుడు, ప్రకృతి విషయములను ఉపనిషత్తులు వివరిస్తాయి.దీనిని వివరించే కొన్నికథలు గూడా వాటిలో ఉంటాయి.
ఈశా వ్యాసం సహా మొదలైన వాటిని నిషత్తులు అంటారు.ఇతి హాసం అనే పదాన్ని ఇతిహ-ఆస ఇలా ఉంటుంది కదా అని అంటారు.
పూర్వం ఎప్పుడో జరిగిన చరిత్రను ఇలా జరిగిందని వివరించేవే ఇతిహాసాలు.ఉదాహరణకు భారతం ఒక ఇతిహాసం.ఇందులో పూర్వం జరిగిన కౌరవ పాండవుల చరిత్ర, దానికి సంబంధించిన ఇతర అంశాలు వివరించబడి ఉంటాయి.ఇతి హాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ అన్నమాటనుబట్టి వేదార్థాలను వివరించడానికే ఇతిహాసాలూ, పురాణాలూ ఆవిర్భవించాయని పండితులు చెబుతారు.
అందుచేత ఉపనిషత్తులు తత్త్వ ప్రధానమైనవికాగా, ఇతి హాసాలు పూర్వ చరిత్ర ప్రధానంగా చెప్పేవి అని స్పష్టం అవుతోంది.