ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.53
సూర్యాస్తమయం: సాయంత్రం.6.54
రాహుకాలం: సా.4.30 ల6.00
అమృత ఘడియలు: ఉ.11.00 ల11.20
దుర్ముహూర్తం: సా.4.25 ల5.13
మేషం:
ఈరోజు బంధు మిత్రులతో ఊహించిన మాటపట్టింపులు కలుగుతాయి.ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు.చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు తప్పవు ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
వృషభం:
ఈరోజు దూరప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేస్తారు.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.
దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది.పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.
వ్యాపారాలు మందగిస్తాయి.ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.
మిథునం:
ఈరోజు సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.మంచి మాట తీరుతో ఇంటాబయట అందరినీ ఆకట్టుకుంటారు.సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు.వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
కర్కాటకం:
ఈరోజు ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి.బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు.చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి.వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి.
సింహం:
ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.ఇంటాబయట ఊహించని చికాకులు పెరుగుతాయి.దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.
కన్య:
ఈరోజు వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు.చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి.దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.ఉద్యోగ ప్రయత్నములు అంతగా అనుకూలించవు.
తుల:
ఈరోజు సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.దైవ అనుగ్రహంతో వ్యాపారాలు లాభాల బాట పడతాయి.ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.
వృశ్చికం:
ఈరోజు ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి.సన్నిహితుల నుంచి అవసరానికి ధనసహాయం అందుతుంది.దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు.ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి.ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో హోదాలు పెరుగుతాయి.
ధనుస్సు:
ఈరోజు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది.దూర ప్రయాణం సూచనలు ఉన్నవి.ఇంటాబయట చికాకులు పెరుగుతాయి.సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి.వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
మకరం:
ఈరోజు ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు.వ్యాపారాలు అంచనాలు అందుకుంటారు.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తలదూరుస్తారు.
కుంభం:
ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.బంధువులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది.ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.దైవదర్శనాలు చేసుకుంటారు.ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు.
మీనం:
ఈరోజు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది.ప్రణాళికలతో అనుకున్న పనులను పూర్తిచేస్తారు.ఆదాయ మార్గాలు పెరుగుతాయి.ఒక వ్యవహారంలో దూరప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు.వ్యాపారాలలో ఉత్సాహంతో ముందుకు సాగుతారు.వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.