కొబ్బరికాయ కొట్టాక పువ్వు కనబడితే ఏం జరుగుతుందో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాలు ప్రకారం ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు తప్పకుండా ఆ శుభకార్యంలో కొబ్బరికాయ మనకు కనబడుతుంది.ఇలా ఏ శుభకార్యాన్ని మొదలు పెట్టాలన్నా లేదా ఏదైనా పూజా కార్యక్రమాలు చేయాలన్నా ముందుగా కొబ్బరికాయను కొట్టి శుభకార్యాలను ప్రారంభిస్తాము.

 Coconut Flower, God, Worship, Appears, Belives-TeluguStop.com

ఈ క్రమంలోనే కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు.అయితే కొన్నిసార్లు మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు లేదా ఏదైనా శుభ కార్యాలు ప్రారంభిస్తున్న సమయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే మన మనసులో తెలియని అలజడి కలుగుతుంది.

ఈ క్రమంలోనే ఆ శుభకార్యం నిర్విఘ్నంగా పూర్తి జరిగే వరకు కూడా మనసులో ఆందోళనకరంగా ఉండటం మనం గమనిస్తూ ఉంటాము.అలాగే కొన్నిసార్లు కొబ్బరికాయ కొట్టిన తరువాత లోపల పువ్వు కనబడుతుంది.

ఇలా పువ్వు రావడంతో మనం చేస్తున్న పని మంచికి సంకేతమని ఆ పనిలో ఎలాంటి ఆటంకాలు కలగవని చాలామంది సంతోషంగా భావిస్తారు.ఇలా కొబ్బరికాయలో పువ్వు రావడం సంతానానికి సంకేతమని పండితులు చెబుతున్నారు.

మనం దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయ లోపల పువ్వు కనబడితే మన కుటుంబంలో సంతాన భాగ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.ఇకపోతే కుళ్ళిన కొబ్బరికాయ వస్తే వెంటనే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని మరొక కొబ్బరికాయ కొట్టడం వల్ల దోషం తొలగిపోతుంది.అంతే కానీ ఎలాంటి కీడు జరుగుతుందని ఆందోళన చెందాల్సిన పని లేదని పండితులు తెలియజేస్తున్నారు.

Coconut Flower, God, Worship, Appears, Belives - Telugu Appears, Coconut Flower, Worship

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube