తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ కొన్ని సినిమాలకు మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఎందుకంటే అవి సృష్టించిన ప్రభంజనాలు అలాంటివి పెద్దగా స్టార్ కాస్ట్ ఏం లేకుండా ఇండస్ట్రీలో ఒక సినిమా రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది అంటే అది సామాన్యమైన విషయం కాదు.సినిమా లో కంటెంట్ ఉంటేనే ఇలాంటి సినిమాల్ని జనాలు ఆదరిస్తారు ఇదంతా ఏ సినిమా గురించి చెప్తున్నానంటే అప్పట్లో రిలీజ్ అయి సంచలన రికార్డు సృష్టించిన మాతృదేవోభవ సినిమా గురించి అసలు ఈ సినిమా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే ఆయన సినిమా చేసిన సినిమా కు ఒక ప్రత్యేకత ఉంటుంది.అప్పట్లో చిరంజీవి తో మంచి హిట్ సినిమాలను ప్రొడ్యూస్ చేశారు అభిలాష, చాలెంజ్ లాంటి మంచి చిత్రాలు వీళ్ళ ప్రొడక్షన్ నుంచి వచ్చినవే అయితే అప్పుడే ఇండస్ట్రీకి కొంగుచాటు కృష్ణుడు అనే సినిమాతో పరిచయమైన కే అజయ్ కుమార్ అనే దర్శకుడిని పెట్టి మాతృదేవోభవ సినిమా తీశారు.
అయితే అజయ్ కుమార్ ఒకరోజు హాలీవుడ్ సినిమా ఆయన హూ విల్ లవ్ మై చిల్డ్రన్ అనే సినిమా చూస్తున్నప్పుడు దాంట్లో ఒక తల్లి బిడ్డల పై చూపించే ప్రేమ ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చూపించారు దాంతో తన హృదయం కరిగిపోయి ఇలాంటి సినిమాని మనం కూడా తెలుగులో ఒకటి చేయాలి అని అజయ్ కుమార్ అనుకొని దాన్ని ఇన్స్పిరేషన్ తో ఒక కథ రాసుకున్నాడు ప్రొడ్యూసర్ కె ఎస్ రామారావు గారికి చెప్పి ఆయన్ని ఒప్పించి సినిమా స్టార్ట్ చేశారు.
అయితే కొద్ది రోజులు షూటింగ్ చేసిన తర్వాత ఇదే స్టోరీ తో సీనియర్ డైరెక్టర్ అయిన పి సి రెడ్డి గారు జయసుధ గారి ని హీరోయిన్ గా పెట్టి ఒక సినిమా తీస్తున్నారు అది ఆల్రెడీ షూటింగ్ అయిపోయే స్టేజ్ కి వచ్చింది అనే విషయం తెలియడంతో కె.
ఎస్.రామారావు గారికి ఏం చేయాలో అర్థం కాక తలకాయ పట్టుకున్నారు అదే సమయంలో ఈ సినిమా ఇన్స్పిరేషన్ తో తీసిన అక్ష దూత్ అనే మలయాళ చిత్రం అక్కడ రిలీజ్ అయి మంచి హిట్ సాధించింది.ఒరిజినల్ వెర్షన్ లో తెలుగు అమ్మాయి అయిన మాధవి గారు నటించారు.అయితే కె ఎస్ రామారావు గారు ఆ రీమేక్ రైట్స్ ని కొన్నారు.కె ఎస్ రామారావు అప్పటికే రాజశేఖర్ తో అంగరక్షకుడు అనే సినిమాని చేస్తున్నారు దాంతో ఈ కథని రాజశేఖర్ కి చెప్పి జీవిత రాజశేఖర్ ఇద్దరిని పెట్టి సినిమా తీద్దాం అనుకున్నారు కానీ జీవిత అప్పటికే నేను పెళ్లి తర్వాత సినిమాలు మానేశాను చేయను అని చెప్పడంతో ఒరిజినల్ వెర్షన్ లో చేసిన మాధవి గారిని హీరోయిన్ గా తీసుకున్నాడు.

ఎందుకంటే మాధవి ఇక్కడ తెలుగులో ఇంతకు ముందు చాలా సినిమాల్లో నటించింది మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ సినిమాలో కూడా మాధవి గారే హీరోయిన్.మాధవి గారితో పాటు హీరో పాత్ర నాజర్ చేశారు ఈ సినిమాలో మ్యూజిక్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరిని తీసుకుందాం అనుకున్నప్పుడు అప్పటికే పెద్ద హీరోల సినిమాలకి మ్యూజిక్ ని ఇస్తున్న కీరవాణి గారిని కలిసి కథ చెప్పారు డైరెక్టర్ కథ బాగా నచ్చి ఆయన మంచి ట్యూన్స్ ఇచ్చారు అటువంటి ట్యూన్స్ కి తగ్గట్టుగా వేటూరి గారు లిరిక్స్ రాశారు సినిమా షూటింగ్ పూర్తయింది.రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించింది దాంతో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు దానికి శోభన్ బాబు,నాగార్జున, జయసుధ, జయప్రద లాంటి ప్రముఖులు వచ్చారు ఈ సినిమా చూసిన శోభన్ బాబు మాతృదేవోభవ తరహాలో పితృదేవోభవ అనే సినిమా చేస్తే రెమ్యూనరేషన్ తీసుకోకుండా యాక్ట్ చేస్తానని చెప్పడం అప్పట్లో సంచలనం రేపింది.

అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఈ సినిమా చూసిన రాజశేఖర్ హీరో పాత్రను నేను చేయాల్సింది చేయలేకపోయాను అని చాలా బాధ పడ్డాడు అయితే ఈ సినిమా జనాలలో విపరీతమైన ఆదరణ పొందింది.ఈ సినిమా గుండెల్ని పిండేసే అంత ఎమోషన్ తో సాగిపోయే చిత్రం కాబట్టి థియేటర్ కి వచ్చిన ప్రతి ఆడియన్ ఏడవకుండా బయటికి వెళ్లలేదు దానికోసం అని కొన్ని థియేటర్లలో అయితే సినిమా చూడ్డానికి వచ్చిన జనాలకి థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు ఏడుపొస్తే తుడుచుకోవడానికి కర్చీఫ్ లను కూడా ఇచ్చారు.ముఖ్యంగా ఈ సినిమాలో రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనే పాటకి వేటూరిగారు రాసిన లిరిక్స్ కి ఆయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఒక సాధారణ సినిమాగా రిలీజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్లాసిక్ గా మిగిలిపోయిన సినిమా ఏదైనా ఉంది అంటే అది మాతృదేవోభవ అని గర్వంగా చెప్పొచ్చు.