శివ పురాణం ప్రకారం మనకు ఉన్న ఏడు రోజుల్లో ఏ దేవుణ్ణి పూజిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో వివరంగా చెప్పారు.ఒక్కొక్కరికి ఒకొక్క ఇష్ట దైవం ఉంటుంది.
వారు తమ ఇష్ట దైవానికి పూజ ఎలా చేయాలో అని ఆలోచనలో పడతారు.ఇప్పుడు ఏ వారంలో మీ ఇష్ట దైవాన్ని పూజించాలో తెలుసుకుందాం.
అలాగే పూజించటం వలన కలిగే అద్భుతమైన ఫలితాల గురించి కూడా తెలుసుకుందాం.ఆదివారం సూర్యుణ్ణి పూజించాలి.
సూర్యుణ్ణి పూజించడం వలన తలకు సంబందించిన సమస్యలు తొలగిపోతాయి.ఇలా ఒక సంవత్సరం పాటు ఆదివారం సూర్యుణ్ణి పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి.
అప్పుడు సూర్యుని అనుగ్రహం కలుగుతుంది.
సోమవారం
సోమవారం సంపద కావాలని కోరుకునేవారు సోమవారం లక్ష్మీదేవిని పూజించి వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి.
అప్పుడు కోరుకున్న కోరిక నెరవేరుతుంది.
మంగళవారంమంగళవారం ఏమైనా వ్యాధులు ఉంటే మంగళవారం కాళీదేవతను పూజించి వేద పండితులకు మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో భోజనం పెట్టాలి.
బుధవారంబుధవారం విష్ణువును పూజించి పెరుగు అన్నాన్ని నైవేద్యం పెడితే కుటుంబంలో అందరు ఆరోగ్యంగా మరియు సుఖ సంతోషాలతో ఉంటారు.
గురువారంగురువారం తమ ఇష్ట దైవానికి పాలతో, నెయ్యితో తయారుచేసిన పదార్ధాలను నైవేద్యం పెడితే ఆయుష్షు,ఆరోగ్యం కలుగుతుంది.

శుక్రవారంశుక్రవారం తమ ఇష్ట దైవాన్ని ఆరాధించి షడ్రుచులతో కూడిన పదార్ధాలను నైవేద్యంగా పెట్టి పండితులకు భోజనం పెడితే అనుకున్న భోగాలను పొందవచ్చు.
శనివారం:శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది.అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇచ్చి నువ్వులు కలిపిన అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి.ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది.