మరో భారీ రిస్క్ కు సిద్ధమైన సూపర్ స్టార్ రజనీకాంత్.. ఆ రేంజ్ హిట్ సాధిస్తారా?

తమిళ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathy)తాజాగా ది గోట్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచి సక్సెస్ ని అందుకుంది.

 Rajinikanth Venkat Prabhu Film, Rajinikanth, Venkat Prabhu, Kollywood, Director,-TeluguStop.com

అయితే ఈ సినిమా సక్సెస్ అయినప్పటికీ మిక్స్డ్ రివ్యూ లు వచ్చాయి.ఈ మూవీ ఒక్క తమిళంలో తప్ప ఏ భాషలో కూడా హిట్ కాలేదు.

అలాగే సినిమాకి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి.వెంకట్ ప్రభు సినిమాలు అంటే బ్లాక్ బస్టర్ హిట్స్ ఉంటాయి.

అలాగే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ కూడా కనిపిస్తాయి.మానాడు సినిమా అతని దర్శకత్వం ప్రతిభని చూపిస్తుంది.

Telugu Kollywood, Rajinikanth, Venkat Prabhu, Vettayan-Movie

ఇదిలా ఉంటే ఇప్పుడు వెంకట్ ప్రభు ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్( rajinikanth) తో మూవీ చేసే అవకాశం సొంతం చేసుకున్నారట.ఇటీవల రజినీకాంత్ కి అతను స్టోరీ లైన్ నేరేట్ చేసినట్లు గట్టిగానే టాక్ వినిపిస్తోంది.త్వరలో ఈ సినిమా గురించి ఒక స్పష్టత రావచ్చని కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది.లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.2.ఓ నుంచి రీసెంట్ గా వచ్చిన వేట్టయన్ వరకు సూపర్ స్టార్ రజినీకాంత్ ఏకంగా నాలుగు సినిమాలు చేశారు.ఈ నాలుగు కూడా కమర్షియల్ గా వారికి సక్సెస్ ఇవ్వలేదు.వేట్టయన్(Vettayan) మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

Telugu Kollywood, Rajinikanth, Venkat Prabhu, Vettayan-Movie

ఈ నేపథ్యంలో లైకా వారికి పరిహారంగా మరో సినిమా చేయాలని రజినీకాంత్ అనుకుంటున్నారు.అయితే ఎవరితో చేస్తారనేది మాత్రం క్లారిటీ లేదు.ఇప్పుడు సడెన్ గా వెంకట్ ప్రభుతో మూవీ అంటూ న్యూస్ తెరపైకి వచ్చింది.ఒక వేళ అన్ని అనుకున్నట్లు సెట్ అయితే రజినీకాంత్ వచ్చే ఏడాది వెంకట్ ప్రభుతో(venkat prabhu) సినిమా మొదలు పెట్టే అవకాశం ఉందనే ప్రచారం గట్టిగా నడుస్తోంది.

అయితే దళపతితో చేసిన ది గోట్ వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత వెంకట్ ప్రభు అనేసరికి సూపర్ స్టార్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని రజినీకాంత్ నుంచి ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

వెంకట్ ప్రభు రజినీకాంత్ ఇమేజ్ కి సరిపోయే మూవీ చేయగలడా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంలో అనేక రకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.మరి సూపర్ స్టార్ తగ్గ హిట్ ని వెంకట్ ప్రభు అందిస్తారో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube